పంజాగుట్టలో ఓ యువతి అదృశ్యమైంది. అనుమానాస్పద స్థితిలో యువతి అదృశ్యం కావడం గమనార్హం. కాగా.. ఈ ఘటన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నేరేడ్‌మెట్‌ ఈస్ట్‌ కాకతీయనగర్‌ జేకే కాలనీకి చెందిన కె.పూజ(21) పంజాగుట్టలోని ఓ ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కాలేజీలో చదువుతోంది. ఈ నెల 22న ఇంటర్వ్యూ ఉందని, కాలేజ్‌కు వెళ్తున్నానని కుటుంబ సభ్యులకు చెప్పి హోండా యాక్టివా (టీఎస్‌ 08ఎఫ్‌ ఎన్‌ 3145)పై వెళ్లింది.

అదే రోజు సాయంత్రం కుటుంబ సభ్యులు పూజకు ఫోన్‌ చేయగా స్నేహితురాలి ఇంటికి వెళ్తున్నాను, తరువాత రోజు ఇంటికి వస్తానని చెప్పింది. మరుసటి రోజు కూడా పూజ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బుధవారం పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.