మతిస్తిమితం లేని ఓ మహిళను మాయమాటలు చెప్పి ముగ్గురు యువకులు అత్యాచారం చేశారు. ఆ తరువాత గొంతు నులిమి చంపేసి.. బావిలో పడేశారు. 

అదిలాబాద్ : అదిలాబాద్ జిల్లాలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న ఓ మహిళను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి.. ఆ తరువాత హత్య చేశారు. ఆమెకు మతిస్థిమితం సరిగా లేదు. భర్త రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పేద కుటుంబం కావడం, భర్త మృతి.. ఒక్కగానొక్క కొడుకుని చూసుకోవాల్సి రావడంతో మతిస్థిమితం కోల్పోయిన ఆ మహిళ నిరాధారంగా మిగిలిపోయింది. 

నిస్సహాయ స్థితిలో భిక్షాటన చేస్తోంది. కొడుకు ఐటీడీఏ ఆశ్రమ పాఠశాలలో పదోతరగతి చదువుకున్నాడు. అతడిని వారి బంధువు ఒకరు ఆశ్రమ పాఠశాలలో చేర్చారు. అక్కడ చదువు పూర్తి చేసుకున్న కుమారుడు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్లో చేరాడు. ఆమెకు భిక్షాటనతో రోజుకి రూ.50, రూ.100 వచ్చే డబ్బులతోనే వారి జీవనం కొనసాగుతోంది. అలాంటి మహిళ మీద కన్నేశారు ముగ్గురు కిరాతకులు. ఆమె అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి, చంపేశారు.

అదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం ధనోర(బి)లో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. అత్యాచారం చేసిన తర్వాత ఆమెను అంతమొందించి వ్యవసాయ బావిలో పడేశారు. శనివారంనాడు ఆ మహిళ (38) మృతదేహం వ్యవసాయ బావిలో తేలుతూ కనిపించింది. ఆమె స్వగ్రామం నేరడిగొండ మండలం, చించోలిప్రియురాలికి పెళ్లైపోయినా టచ్ లో ఉన్నాడని.. యువకుడికి గొడ్డలితో నరికి దారుణహత్య...

చించోలి నుంచి ధనోర(బి) గ్రామంలో ఉన్న తన సోదరీ ఇంటికి గత మంగళవారం వచ్చింది. తిరిగి తమ ఊరు వెళ్లేందుకు బస్టాండ్ కు వెళ్ళింది. అయితే, అప్పటికే చీకటి పడడంతో బస్టాండ్ లోనే పడుకుంది. ఇది గమనించిన ముగ్గురు యువకులు ఆమెతో మాటలు కలిపారు. మతిస్తిమితం సరిగా లేకపోవడంతో ఆమె వారి మాటలను నమ్మింది. ఆమెను వారు సమీపంలోని పొలాలలోకి తీసుకెళ్లారు. ఆ తర్వాత అక్కడ అత్యాచారానికి పాల్పడ్డారు. 

అఘాయిత్యం తర్వాత ఆమె గొంతునులుమి బావిలో పడేశారు. శనివారం ఉదయం వ్యవసాయ కూలీలు పొలానికి పనులకు వెళ్లగా బావిలోనుంచి దుర్వాసన వస్తుండడంతో అనుమానంతో వెళ్లి చూశారు. అక్కడ వారికి మృతదేహం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బావిలో నుంచి శవాన్ని వెలికి తీయించారు. గుర్తుతెలియని శవంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ధనోర(బి) గ్రామంలో ఉన్న బస్టాండ్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. కాగా 20వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో ముగ్గురు వ్యక్తులు ఆ మహిళతో మాట్లాడినట్లుగా వారికి తెలిసింది. మృతురాలి కొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ధనోర(బి) గ్రామానికి చెందిన పసారే సంతోష్, సుమక్ సంతోష్, షేక్ ఖాదర్ లమీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే, నిందితులు పోలీసులకు దొరకకుండా పరారీలో ఉన్నారు.