సికింద్రాబాద్ : నాలాలో కొట్టుకుపోయి మహిళ మృతి, పారిశుద్ధ్య కార్మికురాలిగా గుర్తింపు
సికింద్రాబాద్ మెట్టుగూడలో నాలాలో కొట్టుకుపోయి ఓ మహిళ మృతి చెందింది . మరోవైపు వర్షం కారణంగా గణేశ్ శోభాయాత్రను వీక్షించడానికి వచ్చిన భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు . తెలంగాణలో వచ్చే ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
సికింద్రాబాద్ మెట్టుగూడలో దారుణం జరిగింది. నాలాలో కొట్టుకుపోయి ఓ మహిళ మృతి చెందింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ, పోలీస్ సిబ్బంది నాలాలో గాలించగా.. అంబానగర్ వద్ద మహిళ మృతదేహం లభ్యమైంది. మృతురాలిని పారిశుద్ధ్య కార్మికురాలిగా గుర్తించారు. మరోవైపు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో గురువారం భారీ వర్షం కురిసింది.
కూకట్‌పల్లి, హైదర్‌నగర్, ఆల్విన్ కాలనీ, ప్రగతి నగర్, నిజాంపేట్, ట్యాంక్ బండ్, సికింద్రాబాద్, అడ్డగుట్ట, మారేడ్‌పల్లి, సీతాఫల్‌మండి, బోయిన్‌పల్లి తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. దీంతో లోతట్లు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు వర్షం కారణంగా గణేశ్ శోభాయాత్రను వీక్షించడానికి వచ్చిన భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే భారీ వర్షంలోనూ శోభాయాత్ర కొనసాగిస్తున్నారు.
ALso Read: వచ్చే ఐదు రోజులు భారీ వర్షాలు.. తెలంగాణకు ఐఎండీ ఎల్లో అలర్ట్
ఇకపోతే.. తెలంగాణలో వచ్చే ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్టోబర్ 2 వరకు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఈ మేరకు తెలంగాణకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. ఇక హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై వుంటుందని, తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు.. నిర్మిల్, కామారెడ్డి, భద్రాద్రి, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.