Asianet News TeluguAsianet News Telugu

లైంగికంగా వాడుకుని, రూ.37 లక్షలతో పరారీ.. టెక్కీ ఘరానా మోసం.. !!

అతడో ఘరానా మోసగాడు.. ప్రేమ పేరుతో యువతికి వలవేశాడు... పెళ్లి పేరుతో లైంగిక వాంఛ తీర్చుకున్నాడు. ఆ తరువాత లక్షల రూపాయల నగదు తీసుకుని పరారయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్ కూకట్ పల్లిలో జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తిని కూకట్ పల్లి పోలీసులు రిమాండ్ కు తరలించారు. 

woman files cheating case on techie lover in kukatpally, hyderabad - bsb
Author
Hyderabad, First Published Apr 24, 2021, 9:56 AM IST

అతడో ఘరానా మోసగాడు.. ప్రేమ పేరుతో యువతికి వలవేశాడు... పెళ్లి పేరుతో లైంగిక వాంఛ తీర్చుకున్నాడు. ఆ తరువాత లక్షల రూపాయల నగదు తీసుకుని పరారయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్ కూకట్ పల్లిలో జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తిని కూకట్ పల్లి పోలీసులు రిమాండ్ కు తరలించారు. 

సీఐ నర్సింగరావు తెలిపిన వివరాల ప్రకారం మూసాపేట్ లోని ఆంజనేయనగర్ లో నివాసముంటున్న ఒరిస్సాకు చెందిన జాయ్ ( 32 ) విప్రోలో టీం లీడర్ గా పని చేస్తున్నాడు. అదే కంపెనీలో ఆల్వాల్ కు చెందిన ప్రీతీ (28) ఉద్యోగం కోసం వెళ్ళింది.

ఇంటర్వ్యూ అనంతరం ఆమెకు ఉద్యోగం ఇచ్చాడు జాయ్. దీంతో వారిద్దరి మధ్య చనువు పెరిగింది. ఈ క్రమంలో వారిద్దరూ ప్రేమించుకున్నారు. తాను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెను మూసాపేట్ ఇంటికి రప్పించుకున్నాడు. అనంతరం శారీరకంగా ఇద్దరూ కలిశారు.

తాను బిజినెస్ చేస్తున్నానని, ప్రీతీ దగ్గర డబ్బులు ఉంటే ఇవ్వాలని అడిగాడు. అతని మాటలు నమ్మిన ఆమె తాను దాచుకున్న పదిలక్షలు అతనికి ఇచ్చింది.  అయితే అవి సరిపోవని.. ఇంకా డబ్బు అవసరం ఉందని చెప్పడంతో మూడు బ్యాంకుల్లో అప్పు తీసుకుని సుమారు 27 లక్షల రూపాయలు అతనికి  ఇచ్చింది.  అలా మొత్తం రూ. 37 లక్షలు అతనికి ఇచ్చింది. 

పెళ్లి చేసుకో.. లేదంటే చంపేస్తా...!...

అయితే రుణం తీసుకున్న దగ్గర నుంచి బ్యాంకుల్లో వాయిదాలు చెల్లించాల్సి వచ్చింది. ప్రీతి చెల్లించకపోవడంతో బ్యాంకు వారు వేధించడం మొదలు పెట్టారు. దీంతో ప్రీతి జాయ్ ని నిలదీసింది. అంతే అప్పటికే ఫోన్ స్విచాఫ్ చేసి ఆమెను దూరం పెట్టిన జాయ్.. అక్కడినుంచి పరారయ్యాడు.

ఈ ఘటనతో తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు కూకట్ పల్లి పోలీసులకు మార్చి 4వ తేదీన ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. నిందితుడు మహారాష్ట్రలోని నాసిక్ లో ఉన్నట్లు తెలుసుకుని అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

విచారణలో జాయ్ తనకు అప్పటికే  వివాహం అయిందని, తన భార్య ఊరు వెళ్లిన సమయంలో వీటిని తన ఇంటికి పిలిపించుకున్నానని అంగీకరించాడు. తాను ఆర్థికంగా నష్టపోవడంతో ఈ మోసానికి పాల్పడ్డానని తెలిపాడు. నిందితుడిని పోలీసులు శుక్రవారం రిమాండ్కు తరలించారు. అతని దగ్గరినుంచి 32 లక్షల నగదును సీజ్ చేసినట్లు తెలిపారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios