తనను ప్రేమించి గర్భవతిని చేసి ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే తప్పించుకు తిరుగుతున్నాడంటూ ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది.ఈ సంఘటన మీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

వికారాబాద్ కి చెందిన యువతి(21) జిల్లెలగూడ లలితానగర్ లో నివాసం ఉంటూ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పనిచేసింది. దేవరకొండకు చెందిన విజయ్ కుమార్(25) తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కొన్ని రోజులపాటు వారిద్దరూ ఒకే చోట కలిసి ఉన్నారు.

గత నెల 14న లలితానగర్ లోని వృద్ధ దంపతులకు ఈ యువతి కరోనా టీకా పేరుతో మత్తుమందు ఇచ్చి వారి నగలు చోరీ చేసింది. ఈ కేసులో పోలీసులు ఆమెను జైలుకు పంపించారు. ఇటీవల బయటకు వచ్చిన తరువాత ఆమె విజయ్ కుమార్ ను కలిసి పెళ్లి చేసుకోవాలని కోరగా నిరాకరించాడు.

తనను కలవకపోగా.. ఫోన్ చేసినా స్పందించడంలేదని బాధితురాలు వాపోయింది. దీంతో.. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.