ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా తాంసీలో రెవిన్యూ అధికారిపై మహిళా రైతులు చెప్పులతో దాడి చేశారు.రెవిన్యూ ఆఫీసులోనే అధికారిని మహిళా రైతులు చెప్పులతో కొట్టారు. భూ ప్రక్షాళనలో తమ భూమిని తక్కువగా నమోదు చేశారంటూ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ విషయమై బాధిత రైతు కుటుంబం రెవిన్యూ అధికారులను నిలదీసింది. రెవిన్యూ కార్యాలయానికి వెళ్లి అధికారులను ప్రశ్నించారు.తమ భూమిని తక్కువగా నమోదు చేశారని ఆరోపిస్తూ రెవిన్యూ అధికారిని మహిళలు చెప్పులతో కొట్టారు. బాధిత కుటుంబం దాడికి అధికారి పారిపోయాడు.

తమ భూమిని రికార్డుల్లో తక్కువ నమోదు చేసి ఇతరులకు లబ్దిపొందేలా చేశారని బాధిత కుటుంబం ఆరోపించింది. తమకు న్యాయం చేయాలని రెవిన్యూ అధికారులను కోరుతున్నారు. తమకు అన్యాయం చేసిన అధికారిపై ఆ కుటుంబం దాడికి దిగింది. ఎంత మందిని ఇలా మోసం చేస్తారని ప్రశ్నించింది బాధిత కుటుంబం.