రాజేంద్రనగర్ మైలార్‌దేవ్‌పల్లి పారిశ్రామిక వాడలో ఆదివారం నాడు చెత్త సేకరిస్తున్న సమయంలో చోటు చేసుకొన్న పేలుడుతో ఓ మహిళ మరణించింది. ఈ పేలుడుకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabadరాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని Mailardevpally పారిశ్రామిక వాడలో ఆదివారం నాడు విషాదం చోటు చేసుకొంది. చెత్త సేకరిస్తున్న సమయంలో జరిగిన పేలుడుతో ఓ మహిళ మరణించింది. మృతురాలిని సుశీలమ్మగా గుర్తించారు.
ఇవాళ ఉదయం భార్యాభర్తలు చెత్త సేకరణకు వెళ్లారు. మైలార్‌దేవ్‌పల్లి పారిశ్రామిక వాడలో చెత్తను సేకరిస్తున్న సమయంలో పేలుడు చోటు చేసుకొంది.ఈ ఘటనలో Wife మరణించింది. భర్తకు గాయాలయ్యాయి. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. శంషాబా్ద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి ఘటనస్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
