బాయ్ ఫ్రెండ్ తో ఛాటింగ్ చేస్తూ... ఓ యువతి మూడో అంతస్తు నుంచి కింద పడి ప్రాణాలు విడిచింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో చోటుచేసుకుంది. మృతురాలు ఎయిర్ పోర్ట్ ఉద్యోగిని సిమ్రాన్(22) గా గుర్తించారు. 

పూర్తి వివరాల్లోకి వెళితే... కర్ణాటకలోని ముధోల్‌ టౌన్‌ బాగల్కోట్‌ జిల్లాకు చెందిన సిమ్రాన్‌.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమర్‌ సర్వీసెస్‌ విభాగంలో పనిచేస్తోంది. ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలో హాస్టల్‌లో ఉంటోంది. కాగా మంగళవారం సాయంత్ర 5 గంటల ప్రాంతంలో హాస్టల్‌ మూడో ఫ్లోర్‌ నుంచి కింద పడి మృతి చెందింది.

Also Read 1100 వార్డుల్లో ఆపార్టీలకు అభ్యర్థుల్లేరు, 84 వార్డుల్లో టీఆర్ఎస్ విజయం...
సమాచారం తెలుసుకున్న పోలీసులు.. సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. బాయ్‌ఫ్రెండ్‌తో చాటింగ్‌ చేస్తూ ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. తన డిప్రెషన్‌లో ఉన్నట్లు తెలిసిందన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు పేర్కొన్నారు.