వేములవాడ: వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన ఓ భక్తురాలు గుండెపోటుతో మృతి చెందింది. స్థానికుల కథనం మేరకు.. మహబూబాబాద్‌ జిల్లా పాకాల కొత్తగూడెం మండలం, ఎదులపల్లి గ్రామానికి చెందిన కడుగూరి పూలమ్మ(60) సోమవారం కుటుంబ సభ్యులతో కలసి రాజన్నను దర్శించుకుంది.

మంగళవారం బద్ది పోచమ్మకు బోనం మొక్కును చెల్లించుకునేందుకు వసతి గది నుంచి బయలుదేరింది. ఈ క్రమంలో రోడ్డుపైనే అకస్మాత్తుగా పడిపోయి అక్కడికక్కడే మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు