విషాదం : చీకట్లో దారి కనిపించక స్కూటీతో సహా కాల్వలోకి .. మహిళా కానిస్టేబుల్ మృతి
భద్రాచలంలో ప్రమాదవశాత్తు కాల్వలో పడి మహిళా కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయింది. సీతారామచంద్రస్వామి ఆలయంలో విధులు నిర్వర్తిస్తున్న మహిళా కానిస్టేబుల్ రమాదేవి మృతదేహాన్ని అధికారులు వెలికితీశారు.

భద్రాచలంలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు కాల్వలో పడి మహిళా కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయింది. ఆమెను సీతారామచంద్రస్వామి ఆలయంలో విధులు నిర్వర్తిస్తున్న మహిళా కానిస్టేబుల్ రమాదేవిగా గుర్తించారు. శుక్రవారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా వర్షం పడింది. దీనికి తోడు ఆ మార్గంలో లైట్లు లేకపోవడంతో చీకట్లో దారి కనిపించక స్కూటీతో సహా కాల్వలో పడిపోయింది రమాదేవి. స్థానికుల సమాచారం ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. స్లోయిస్ గేట్ల వద్ద కానిస్టేబుల్ రమాదేవి మృతదేహాన్ని వెలికితీశారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.