రాఖీపండుగ ఓ ఇంట విషాదం నింపింది. రాఖీపౌర్ణమి సందర్భంగా తన సోదరుడికి రాఖీ కట్టేందుకు వెళ్లేందుకు భర్త పంపడం లేదని మనోవేదనకు గురై ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. 

సికింద్రాబాద్: రాఖీపండుగ ఓ ఇంట విషాదం నింపింది. రాఖీపౌర్ణమి సందర్భంగా తన సోదరుడికి రాఖీ కట్టేందుకు వెళ్లేందుకు భర్త పంపడం లేదని మనోవేదనకు గురై ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. మూడంతస్థుల భవనంపై నుంచి దూకి ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన సికింద్రాబాద్ లోని కుమ్మరిగూడలో చోటు చేసుకుంది. 

రాజస్థాన్ కు చెందిన ఉత్తమ్, దేవీ దంపతులు కుమ్మరిగూడలో నివాసం ఉంటున్నారు. దేవీ తన సోదరుడు మహారాష్ట్ర పూణెలో ఉండటంతో అతనికి రాఖీ కట్టేందుకు వెళ్తానని భర్త ఉత్తమ్ ను కోరింది. అందుకు భర్త ససేమిరా అనడంతో తీవ్ర మనోవేదనకు గురైంది. మూడంతస్థుల భవనం నుంచి కిందకు దూకింది. వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.