అదీ కాక.. లాక్ డౌన్ కారణంగా చేయడానికి పనులు లేక  కుటుంబ పోషణ కోసం ఆర్థికంగా ఇబ్బందులు పడుతోంది. మంగళవారం ఇంట్లో అందరూ భోజనాలు చేస్తుండగా బాత్‌రూమ్‌ వెళ్తనని చెప్పి వెళ్లింది.

ఓ మహిళ బాత్రూంకి అని చెప్పి వెళ్లి ఎంతసేపైనా తిరిగి రాలేదు. దీంతో.. ఆమె కోసం వెళ్లగా.. శవమై కనిపించింది. ఆర్థిక సమస్యల కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటన మలక్ పేట గాంధీ నగర్, ఎస్ టీ కాలనీలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఎస్టీ కాలనీకి చెందిన సబావత్‌ నాగమణి(40) కూలి పనిచేసుకొని జీవిస్తోంది. ఆమె భర్త శివరాజ్‌ నాయక్‌ ఆటో డ్రైవర్‌. ఏడాది నుంచి కేన్సర్‌తో బాధపడుతున్నాడు. నాగమణికి ఇద్దరు పిల్లలు. పెద్ద కుమారుడు బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతుండగా, కుమార్తె ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ చదువుతోంది. 

నాగమణికి ప్రతిరోజూ కల్లు తాగే అలవాటు ఉంది. చేతిలో డబ్బు లేకపోవడంతో కల్లు కూడా దొరకడం లేదు. అదీ కాక.. లాక్ డౌన్ కారణంగా చేయడానికి పనులు లేక కుటుంబ పోషణ కోసం ఆర్థికంగా ఇబ్బందులు పడుతోంది. మంగళవారం ఇంట్లో అందరూ భోజనాలు చేస్తుండగా బాత్‌రూమ్‌ వెళ్తనని చెప్పి వెళ్లింది. కాగా.. అలా వెళ్లిన ఆమె ఎంతసేపైనా తిరిగి రాలేదు. 

ఇరుగు పొరుగు వారి సహాయంతో బాత్‌రూమ్‌ తలుపు తీసి చూడగా ఉరేసుకొని కనిపించింది. వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలి కుమారుడు సబావత్‌ శ్రీకాంత్‌ ఫిర్యాదు మేరకు మలక్‌పేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.