సంక్రాంతి సందర్భంగా హుజురాబాద్‌లో కొందరు మహిళలు దాండియా ఆడుతుండగా విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ దాండియా ఆడుతూనే కిందపడిపోయింది. ఆ తర్వాత గుండెపోటుతో మరణించింది.  

Heart Attack: సంక్రాంతి వేడుకలో విషాదం చోటుచేసుకుంది. పండుగను పురస్కరించుకుని హుజురాబాద్‌లో కొందరు మహిళలు ఒక చోట చేరి దాండియా ఆడారు. వారి ఆటను మరికొందరు ఎంజాయ్ చేస్తూ ఫోన్‌లు తీసి రికార్డు చేశారు. ఇంతలోనే ఓ మహిళ దాండియా ఆడుతూనే కిందపడిపోయింది. దాండియా ఆడుతూనే నేలపై కుప్పకూలిపోయింది. మంగళవారం ఆమె గుండె పోటు(!)తో మరణించింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతున్నది.

అందరు మహిళల్లాగే ఆమె కూడా కోలలు పట్టుకుని దాండియా ఆడుతున్నది. రౌండ్‌గా తిరుగుతూ ఉల్లాసంగా వారంతా ఆడుకుంటున్నారు. పలు రౌండ్లు వేసిన తర్వాత ఆమె అడుగు తడబడింది. లయ తప్పింది. క్షణాల్లోనే కిందపడిపోయింది. దీంతో అక్కడున్నవారంతా షాక్ అయ్యారు. మహిళలు వెంటనే ఖంగుతిన్నారు. ఆట ఆపి ఆమె చుట్టూ గుమిగూడారు. వీడియో తీస్తున్నవారు కూడా హుటాహుటిన ఆమె వద్దకు వెళ్లారు. ఈ దృశ్యాలు వైరల్ అవుతున్న వీడియోలో కనిపించాయి.

Scroll to load tweet…

Also Read: YS Sharmila: అన్నా, చెల్లి మధ్య వైరం ఎందుకు మొదలైంది? జగన్‌ను నేరుగా ఢీకొడుతారా?

ఇలా ఆడుతుండగా, డ్యాన్స్ చేస్తుండగా మరణిస్తున్న ఘటనలు కొంత కాలంగా కలకలం రేపుతున్నాయి. ఈ మరణాలకు చాలా మంది కరోనా వ్యాక్సిన్‌లతో లింక్ పెడుతున్నారు. ఆ వ్యాక్సిన్‌ల వల్లే ఇలా హఠాణ్మరణాలు చోటుచేసుకుంటున్నాయని వారు ఆరోపిస్తున్నారు. అయితే.. ఈ ఆరోపణలు అసంగతమైనవని ఓ పరిశోధనలో వెల్లడైంది. పీఎల్‌వోఎస్ వన్ అనే ప్రచురిత, పరిశోధనాత్మక కథనం ఈ ఆరోపణలు కొట్టివేసింది.