స్నేహితుడి భార్యపై ఓ వ్యక్తి కన్నేశాడు. స్నేహానికి ద్రోహం చేసి.... స్నేహితుడి భార్యపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను అతి దారుణంగా హత్య  చేశాడు. ఈ దారుణ సంఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.... జిల్లాలోని బెజ్జంకి మండలం వడ్లూర్‌ గ్రామానికి చెందిన మహిళ ఉదయాన్నే మాదాపూర్‌లోని తమ పొలానికి వెళ్లింది. మరోవైపు.. ఆమె భర్త తన స్నేహితుడు చెక్కిల్ల శ్రీనివా్‌సగౌడ్‌తో కలిసి మధ్యాహ్నం నుంచి వడ్లూర్‌ గ్రామంలోని బెల్ట్‌ షాప్‌లో మద్యం తాగసాగాడు.

సాయంత్రం 4 గంటలకు తన భార్యను తీసుకురమ్మంటూ శ్రీనివా్‌సగౌడ్‌కు ద్విచక్ర వాహనం ఇచ్చి పంపాడు. అప్పటికే మత్తుతో మదమెక్కిన శ్రీనివాస్ గౌడ్‌.. తన స్నేహితుడి భార్యను మొక్కజొన్న చేలోకి లాక్కెళ్లి అత్యాచారం చేసి, అనంతరం గొంతు నులిమి చంపేశాడు. కాగా... పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

మద్యం మత్తులో తాను నేరం చేసినట్లు అతను అంగీకరించినట్లు పోలీసులు చెప్పారు. సదరు మహిళ భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.