Asianet News TeluguAsianet News Telugu

గ్రామ ప్రజాప్రతినిధికి వలపు వల.. బ్లాక్ మెయిలింగ్.. ట్విస్ట్ ఇచ్చిన మహిళ...

ఇంట్లో చేరిన కొద్ది రోజులకే సదరు ప్రజా ప్రతినిధితో గొడవ మొదలు పెట్టింది.  నీ ఆస్తిలో వాటా ఇవ్వాలని.. లేదంటే తనను లైంగికంగా వేధించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బ్లాక్ మెయిలింగ్ కు దిగింది. 

woman blackmailing village officer for his property in nizambad
Author
Hyderabad, First Published Aug 5, 2021, 4:12 PM IST

ఓ మహిళ విసిరిన వలపు వలలో చిక్కుకుని గ్రామ ప్రజాప్రతినిధి ఒకరు విలవిల్లాడుతున్నారు. దీని నుంచి రక్షించుకునేందుకు ఆయన పడరాని పాట్లు పడుతున్నాడు. అటు పోలీసు కేసు, ఇటు మహిళ బ్లాక్ మెయిల్ వ్యవహారంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. 

కామారెడ్డి జిల్లాలోని గాంధారి మండలం  మారుమూల గ్రామం ప్రజాప్రతినిధి ఒకరు జిల్లా కేంద్రమైన కామారెడ్డి పట్టణంలో నివసిస్తున్నాడు. ఆయనకు కాకతీయ నగర్ లో రెండంతస్తుల ఇల్లు ఉంది. ప్రజా ప్రతినిధి  ఇంటి అడ్రస్ కనుక్కుని వచ్చిన మహిళలు తమకు ఇల్లు కిరాయికి కావాలంటూ అడిగారు. అందులో ఓ యువతి మర్యాదగా మాట్లాడుతూ ఆ ప్రజా ప్రతినిధి నమ్మించి ఇల్లు కిరాయికి ఇచ్చేలా చేసుకుంది.

ఇంట్లో చేరిన కొద్ది రోజులకే సదరు ప్రజా ప్రతినిధితో గొడవ మొదలు పెట్టింది.  నీ ఆస్తిలో వాటా ఇవ్వాలని.. లేదంటే తనను లైంగికంగా వేధించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బ్లాక్ మెయిలింగ్ కు దిగింది. ఆ ప్రజా ప్రతినిధి మొండిగా వ్యవహరించడంతో దేవునిపల్లి పోలీసులను ఆశ్రయించింది.

Follow Us:
Download App:
  • android
  • ios