ప్రియుడి ఇంటిముందే ప్రియురాలి ఆత్మహత్యాయత్నం

First Published 2, Dec 2017, 3:44 PM IST
woman attempts suicide in front of lovers house
Highlights
  • మంచిర్యాల జిల్లాలో దారుణం
  • ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ఆత్మహత్యాయత్నం
  • పరిస్థితి విషమం

 

ప్రేమించిన ప్రియుడే పెళ్లికి అంగీకరించపోవడంతో ఆ యువతి తట్టుకోలేక పోయింది. అతడి ఇంటి ముందు నిరసనకు దిగింది. అయినా అతడిలో చలనం లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోక చివరకు యువతి ప్రాణత్యాగానికి సిద్దమై,ఆస్పత్రిలో చావుబతుకుల మద్య కొట్టుమిట్టాడుతున్న విషాద సంఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది.  నమ్మినవాడే కాదుపొమ్మంటే తట్టుకోలేక నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువతి గాధ ఇది.

ఈ ఆత్మహత్యకు సంభందించిన వివరాలిలా ఉన్నాయి. మంచిర్యాల జిల్లా నస్పూరు మండల కేంద్రానికి చెందిన గంపల సుజాత, నరేష్ లు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే సుజాత పెళ్లిపేరు ఎత్తే సరికి నరేష్ ఆమెను వదిలించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. దీంతో మోసపోయానని గ్రహించిన యువతి గురువారం నుంచి ప్రియుడి ఇంటిముందు నిరసనకు దిగింది.

అయితే శుక్రవారం గ్రామ పెద్దలు ఇరు కుటుంబాలను కూర్చోబెట్టి రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. ఎలాగు ప్రేమించుకున్నారు కాబట్టి పెళ్లి చేసుకోవాలని నరేష్ ను సూచించారు. ఈ రాజీప్రయత్నాలను నరేష్ తో పాటు అతడి కుటుంబం ససేమిరా అన్నారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన యువతి అర్థరాత్రి సమయంలో అతడి ఇంటి ఎదుటు ఆత్మహత్యాయత్నం చేసింది. నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితిలోకి వెళ్లిన యువతిని గమనించిన సీసీసీ పోలీసులు యువతిని మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  ప్రస్తుతం యువతి పరిస్థితి ఆందోళన కరంగా ఉన్నట్లు, ఆమెను ఐసీయూలో పెట్టి చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు.

ప్రేమ పేరుతో సుజాతను మోసం చేసి ఈ ఆత్మహత్యకు కారణమైన నరేష్ ను వెంటనే అరెస్ట్ చేయాలని యువతి కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. 
 
 

loader