ఖమ్మలో ఓ మహిళా న్యాయవాది రాసిన లేఖ వైరల్ గా మారింది. తన సీనియర్ తనమీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఎన్నిసార్లు చెప్పినా తీరు మారడంలేదని ఆమె ఆరోపించారు.
ఖమ్మం : అదనపు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బెల్లం ప్రతాప్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఓ మహిళా జూనియర్ అడ్వకేట్ ఇక్కడి షెడ్యూల్డ్ కులాలు, తెగల ఫ్యామిలీ కోర్టుకు రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లేఖ కాపీ వివిధ వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతోంది.
“నేను ప్రతాప్ వద్ద కోర్టు అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాను. ఆయన ఆఫీసులో కేసులకు హాజరవడం ద్వారా కోర్టు వ్యవహారాలు నేర్చుకున్నాను. ఈ క్రమంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ నన్ను లైంగిక వేధింపులకు గురిచేశాడు. దీనిని నేను చాలాసార్లు వ్యతిరేకించాను. అయినా అతను అలాగే చేస్తున్నాడని, అతను కూడా ఎస్సీ వర్గానికి చెందిన వాడేనని.. న్యాయవాది చంద్రావతి తన లేఖలో పేర్కొన్నారు.
వేధింపులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని.. ఆమె తన కష్టాలను అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోక్సో-1కి వివరించింది. "ఆ సమయంలో ఆయన నన్ను ఓదార్చారు. అతనిలో మార్పు కోసం కొంత వేచి ఉండమని నన్ను కోరారు." మహిళా న్యాయవాదిని ఇకపై వేధించవద్దని, తన పరిమితులను దాటవద్దని అదనపు పీపీ తన సీనియర్‌కు సూచించినట్లు చంద్రావతి ఫిర్యాదులో పేర్కొన్నారు.
కృష్ణమోహన్, పి శ్రీనివాస్ అనే వ్యక్తులు ప్రతాప్‌కు మద్దతుగా నిలిచారని, ఆ ముగ్గురూ తనకు ఇబ్బందులు సృష్టించారని ఆమె అన్నారు. ప్రతాప్‌కు నేను అన్ని విధాలుగా సహకరిస్తే ఆర్టీసీలో న్యాయ సలహాదారు పదవిని ఇస్తానని ప్రతాప్ వాగ్దానం చేశారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన రాష్ట్ర మంత్రితో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, తన కోసం ఏదైనా చేయగలనని ప్రతాప్ ప్రలోభపెట్టే పనిలో భాగంగా పదే పదే చెప్పేవాడని చంద్రావతి చెప్పారు. తాను చేసిన ఆరోపణలపై విచారణకు ఆదేశించి తనకు న్యాయం చేయాలని కోర్టును ఆశ్రయించింది.
ఇదిలా ఉండగా, Karnatakaలోని బాగల్‌కోట్ జిల్లా వినాయక్ నగర్ సమీపంలో శనివారం మధ్యాహ్నం ఓ మహిళపై దారుణమైన attack జరిగింది. ఆమెను పలుమార్లు చెప్పుతో కొట్టి, తన్నిన దారుణం చోటుచేసుకుంది. ఈ దాడికి పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు లాయర్ కావడం గమనార్హం. లాయర్ అయిన సంగీత అనే మహిళపై ఆమె పొరుగింటి మహంతేష్ దాడి చేశాడు.
ఈ సంఘటనను సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో మంతేష్ తీవ్ర ఆగ్రహంతో, బలవంతంగా మహిళపై దాడి చేసినట్లు కనిపిస్తుంది. ఆమెను చెంపదెబ్బలు కొడుతూ, తంతూ దారుణంగా దాడి చేశాడు. ఈ దెబ్బలకు ఆమె వెనక్కి పడుపోతూ.. ప్లాస్టిక్ కుర్చీ తీసుకుంటుండగా ఆ వ్యక్తి మళ్లీ ఆమెను తన్నాడు. కడుపులో తీవ్రంగా తంతుంటూ పక్కనుంచి ఎవరో అరవడం వినిపిస్తుంది.
ఈ దాడి సమయంలో చుట్టుపక్కల చాలా మందే జనం కనిపిస్తున్నప్పటికీ.. ఎవ్వరూ దాడిని ఆపే ప్రయత్నం చేయలేదు. మరికొందరు వీడియోలు తీశారు. చుట్టుపక్కల జనం ఉన్నప్పటికీ నిర్దాక్షిణ్యంగా కొట్టుకుంటున్న మహిళను ఆదుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అయితే ఈ దాడికి కారణం వీరిద్దరి మధ్య ఉన్న గొడవలే అని తెలుస్తోంది.
సివిల్ వివాదం కేసులో వ్యక్తిగత శత్రుత్వం కారణంగా మంతేష్ మహిళపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. మహిళా న్యాయవాది తనను చిత్రహింసలకు గురిచేశిందని, వేధించిందని నిందితుడు ఆరోపించాడు. వీరిద్దరు గతంలో కూడా పలుమార్లు గొడవ పడ్డారని సమాచారం.
