Asianet News TeluguAsianet News Telugu

మునుగోడు ఉప ఎన్నిక వేళ తెలంగాణలోనే రాహుల్.. భారత్ జోడో యాత్ర కాంగ్రెస్‌ను గెలిపిస్తుందా..?

దేశంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి, పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సహం తెచ్చేందుకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. మునుగోడు ఉప ఎన్నిక జరగనున్న సమయంలో.. రాహుల్ యాత్ర తెలంగాణలోనే కొనసాగనుంది. దీంతో రాహుల్ యాత్ర మునుగోడులో కాంగ్రెస్‌‌కు ఏ మేరకు ప్రయోజనం చేకూరుస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. 

will Rahul gandhi Bharat jodo yatra in telangana help congress in munugode bypoll
Author
First Published Oct 3, 2022, 4:09 PM IST

దేశంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి, పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సహం తెచ్చేందుకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. మునుగోడు ఉప ఎన్నిక జరగనున్న సమయంలో.. రాహుల్ యాత్ర తెలంగాణలోనే కొనసాగనుంది. దీంతో రాహుల్ యాత్ర మునుగోడులో కాంగ్రెస్‌‌కు ఏ మేరకు ప్రయోజనం చేకూరుస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. 

దేశంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి, పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సహం తెచ్చేందుకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. దాదాపు 150 రోజుల పాటు రాహుల్ పాదయాత్ర కొనసాగనుంది. రాహుల్ యాత్రతో కాంగ్రెస్ కొత్త జోష్ వస్తుందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణాదిలో కాంగ్రెస్‌కు బూస్ట్ ఇస్తుందని వాదన వినిపిస్తుంది. దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి బలమైన క్యాడర్, మద్దతుదారులు, పార్టీ ఐడియాలజీని అభిమానించేవారు చాలా మందే ఉన్నారు. అలాగే గ్రాండ్ ఓల్డ్ పార్టీగా ఉన్న కాంగ్రెస్‌పై జనాల్లో కూడా సాఫ్ట్ కార్నర్ ఉంది. అయితే కాంగ్రెస్‌ నేతల మధ్య సమన్వయ లోపం, పార్టీకి సరైన దిశా నిర్దేశనం లేకపోవడం అనేది ప్రధాన సమస్యగా మారింది. 

దీంతో దక్షిణాదిలో ఆ పార్టీ పరిస్థితి.. చుక్కాని లేని నావగా మారిందనే చెప్పాలి. అయితే రాహుల్ పాదయాత్ర దక్షిణాదిలో పార్టీ పరిస్థితిని మారుస్తుందనే అభిప్రాయం వ్యక్తం వ్యక్తం అవుతోంది. పార్టీ కార్యకర్తలు కూడా ఇదే నమ్మకంతో ఉన్నారు. ఇప్పటివరకు రాహుల్ యాత్రకు వస్తున్న స్పందన కూడా ఇందుకు బలం చేకూరుస్తుంది. 

అయితే తెలంగాణ కాంగ్రెస్‌కు రాహుల్ యాత్రను ఏ మేరకు బూస్ట్ ఇస్తుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మునుగోడు ఉప ఎన్నిక జరుగుతున్న సమయంలోనే రాహుల్ గాంధీ యాత్ర తెలంగాణలోకి ఎంటర్ కానుంది. దీంతో రాహుల్ యాత్ర.. మునుగోడులో కాంగ్రెస్‌కు లబ్దిచేకూరుస్తుందా? అనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. 

కేంద్ర ఎన్నికల సంఘం నేడు మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్‌‌ను విడుదల చేసింది. అక్టోబర్ 7న ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల కానుంది. నవంబర్ 3ను మునుగోడులో పోలింగ్ జరగనుంది. అంటే అక్టోబర్ చివరి వారంలో మునుగోడులో రాజకీయ పార్టీల ప్రచారం చివరి దశకు చేరుకోనుంది. అదే సమయంలో రాహుల్ గాంధీ యాత్ర తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. 

ప్రస్తుతం కర్ణాటకలో కొనసాగుతున్న రాహుల్ పాదయాత్ర.. అక్టోబర్ 24న తెలంగాణలోని ముక్తల్ నియోజకవర్గంలో ప్రవేశిస్తుంది. మొత్తంగా తెలంగాణలో 13 రోజుల పాటు రాహుల్ యాత్ర సాగనుంది. అక్టోబర్ చివరి నాటికి రాహుల్ యాత్ర హైదరాబాద్‌లోకి ప్రవేశిస్తుంది. హైదరాబాద్ నగరంలోని ప్రధాన ప్రాంతాల గుండా రాహుల్ యాత్ర సాగనున్న నేపథ్యంలో.. రాష్ట్రంలోని ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు అవకాశం ఉంటుంది.  హైదరాబాద్‌కు మునుగోడు 80 కి.మీ దూరంలో మాత్రమే ఉంది. ఈ క్రమంలోనే రాహుల్ తన పాదయాత్రలో మునుగోడు ఉప ఎన్నికను కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. ఇది కాంగ్రెస్‌కు ఒక రకంగా లాభం చేకూర్చే అంశమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

2018 అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడులో కాంగ్రెస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అక్కడ కాంగ్రెస్‌ పార్టీకి క్యాడర్ కూడా ఉంది. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు కొందరు నేతలు బీజేపీ గూటికి చేరడం కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగా మారింది. అయితే ప్రస్తుతం అక్కడ త్రిముఖ పోరు ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 

ఇక, కాంగ్రెస్ మునుగోడులో సిట్టింగ్ స్థానాన్ని నిలపుకోవాలని గట్టి ప్రయత్నాలే చేస్తోంది. మునుగోడును కైవసం చేసుకునేందుకు గతానికి భిన్నంగా పావులు కదుపుతుంది. ముందుగానే తమ పార్టీ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని ఖరారు చేసింది. ఇప్పటికే స్రవంతి క్షేత్ర స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి, ఇతర సీనియర్ నాయకులు.. మునుగోడులోని పార్టీ ముఖ్య నాయకులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. 

ఈ ప్రయత్నాలకు రాహుల్ పాదయాత్ర బూస్ట్ ఇస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తటస్థ ఓటర్లపై రాహుల్ యాత్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. టీఆర్‌ఎస్‌‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు చూస్తున్నవారిని.. రాహుల్ తన యాత్ర ద్వారా ఏ మేరకు ప్రభావితం చేస్తారనేది ఇక్కడ కీలకంగా మారనుందని విశ్లేషకులు చెబుతున్నారు. రాహుల్ యాత్ర సాగనున్న నేపథ్యంలో పలువురు పార్టీ సీనియర్లు కూడా ఆయన వెంటనే ఉండనున్నారు. దీంతో రాహుల్ యాత్రను, పార్టీ సీనియర్ల సేవలను టీ కాంగ్రెస్ నేతలు.. మునుగోడు ఉప ఎన్నికలో ఏ విధంగా వాడుకుంటారనేది కూడా ముఖ్యమనే చెప్పాలి. 

ఎందుకంటే.. మునుగోడులో ప్రచారం కోసం బీజేపీ జాతీయ నేతలను రంగంలోకి దింపే అవకాశం ఉంది. టీఆర్ఎస్ తరఫున కేసీఆర్ అన్ని తానై వ్యవహరించనున్నారు. ఇప్పటికే మునుగోడు బహిరంగ సభ నిర్వహించి టీఆర్ఎస్ ప్రచారానికి శ్రీకారం చుట్టిన కేసీఆర్.. మరోమారు అక్కడ పర్యటించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే కాంగ్రెస్ విషయానికి వస్తే.. రాహుల్, ప్రియాంక, సోనియాలను పక్కనబెడితే మునుగోడుకు వచ్చి ఓటర్లను ప్రభావితం చేసే జాతీయ స్థాయి నాయకులు ఆ పార్టీలో లేరనే చెప్పాలి. అలాంటింది ఇప్పుడు రాహుల్ పాదయాత్ర మునుగోడుకు సమీపంలోనే సాగడం కచ్చితంగా కాంగ్రెస్‌కు కలిసివచ్చే అంశమనే ఆ పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తోంది. 

అయితే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు విబేధాలను పక్కనబెట్టి.. ఏకతాటిపై నడవడం కూడా మునుగోడులో ఆ పార్టీ భవిష్యత్తును నిర్ణయించనుంది. అదే సమయంలో టీ కాంగ్రెస్ నాయకులు రాహుల్ పాదయాత్రపైనే పూర్తి దృష్టి సారించి.. మునుగోడులోని క్షేత్రస్థాయిలో పరిస్థితులను పట్టించుకోకపోయిన ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కూడా లేకపోలేదు. మరి తెలంగాణలో రాహుల్ పాదయాత్ర.. మునుగోడులో కాంగ్రెస్‌ పార్టీ విజయానికి దోహదం చేస్తుందా? లేదా? అనేది మరో నెల రోజుల్లో తేలిపోనుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios