Asianet News TeluguAsianet News Telugu

Congress: ప్రగతి భవన్‌ను ప్రజల కోసం తెరుస్తాం.. బీఆర్ఎస్ పై రాహుల్ గాంధీ ఫైర్

Rahul Gandhi: తెలంగాణ‌లో కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే "ప్రజల ఫిర్యాదులను 72 గంటల్లో వినడానికి, పరిష్కరించడానికి సీఎం, మంత్రులందరూ క్రమం తప్పకుండా ప్రజా దర్బార్‌లు నిర్వహిస్తారు" అని కాంగ్రెస్ పార్టీ నాయ‌కుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
 

Will open Pragathi Bhavan to public once Congress wins Telangana, says Rahul Gandhi RMA
Author
First Published Nov 17, 2023, 11:32 PM IST

Telangana Assembly Elections 2023: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన ప్రగతి భవన్ పేరును 'ప్రజాపాలన భవన్' (ప్రజా పాలన భవనం)గా మారుస్తానని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ  హామీ ఇచ్చారు. "తెలంగాణ ముఖ్యమంత్రి నివాసం, కార్యాలయ భవనం తలుపులు 24 గంటలపాటు ప్రజలకు అందుబాటులో తెరిచి వుంటాయ‌ని తెలిపారు. అలాగే, ప్ర‌జా తెలంగాణ కాంగ్రెస్ విజ‌న‌న్ అనీ, దాని కోసం ప్రజల తెలంగాణ - బహిరంగ పాలనను వాగ్దానం చేస్తుంద‌ని ఆయ‌న అ్న‌నారు.

తెలంగాణ‌లో కాంగ్రెస్ అధ‌కారంలోకి వ‌స్తే "ప్రజల ఫిర్యాదులను 72 గంటల్లో వినడానికి, పరిష్కరించడానికి సీఎం, మంత్రులందరూ క్రమం తప్పకుండా ప్రజా దర్బార్‌లు నిర్వహిస్తారు" అని  కాంగ్రెస్ పార్టీ నాయ‌కుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఇదే క్ర‌మంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు ఎ రేవంత్ రెడ్డి అధికార పార్టీ (బీఆర్ఎస్) ను టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు గుప్పించారు. బీఆర్ఎస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సాధారణ ప్రజలను ప్రగతి భవన్‌లోకి రాకుండా చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

గత తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ ఇచ్చిన హామీలను అమలు చేయలేదనీ, పేదల ప్రభుత్వం కావాలంటే కాంగ్రెస్ కు ఓటు వేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. నగరంతో పాటు చుట్టుపక్కల అసెంబ్లీ సెగ్మెంట్లలో జరిగిన సభల్లో రేవంత్ మాట్లాడుతూ.. ఇది పాలకులకు, ప్రజలకు మధ్య జరుగుతున్న పోరాటంగా ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఎన్నిక‌ల‌ను అభివ‌ర్ణించారు. ప్రజల ఆకాంక్షలను బీఆర్ఎస్ నెరవేర్చడం లేదన్నారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డు సమస్య కూడా పరిష్కారం కాలేదనీ,  మేడ్చల్ కు డిగ్రీ కళాశాల, 100 పడకల ఆస్పత్రి ఏర్పాటుకు తాము ప్రాధాన్యమిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ తక్కువ ధరకే గ్యాస్ సిలిండర్లు అందిస్తుందనీ, ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామని రేవంత్ చెప్పారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios