భర్త మరో స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో ఓ భార్య దారుణానికి ఒడిగట్టింది. భర్త మీద యాసిడ్ తో దాడి చేసి కసి తీర్చుకుంది. సూర్యాపేట జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. 

జిల్లాలోని కోదాడ శ్రీనివాసనగర్‎లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రేమించకపోతే యాసిడ్ దాడి చేసిన ఘటనలే ఇప్పటివరకు విన్నాం. ఇప్పుడు మరో కొత్త రకం యాసిడ్ దాడులకు తెరలేపింది ఈ ఘటన. 

భర్త నరసింహారావు మీద అనుమానం రావడంతో భార్య లక్ష్మీ యాసిడ్‌తో దాడికి పాల్పడింది. యాసిడ్ దాడిలో భర్త నరసింహారావు ముఖం మొత్తం ఖాళీ పోవడంతో పరిస్థితి విషమం మారింది. ఈ ఘటనతో అక్కడున్న స్థానికులు వెంటనే నరసింహారావును దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. 

అయితే భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతోనే దాడి చేసినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరిస్తున్నారు.