పెళ్లైన నెలకే భార్యను వదిలేసిన ఎన్నారై భర్త, అత్తారింటి ఎదుట బాధితురాలి ఆందోళన

wife strike in front of husband house
Highlights

ఓ యువతిని పెళ్లి చేసుకున్న నెలరోజులకే వదిలించుకుని విదేశాలకు చెక్కేశాడో భర్త. అయితే అతడి కోసం గత నాలుగు సంవత్పరాలుగా ఎదురుచూసి, చివరకు మోసపోయానని గ్రహించి బాధితురాలు అత్తవారింటి ఎదుట ధర్నాకు దిగింది.  తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుండి కదలనని బాధితురాలు ఆవేధన వ్యక్తం చేస్తోంది.
 
ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ కు చెందిన తనుశ్రీకి చిన్నపుడే తండ్రి చనిపోవడంతో తల్లే అన్నీ తానై పెంచింది. కూతురికి ఎలాంటి లోటు రాకుండా ఉండాలని వరంగల్ జిల్లా క్యాతపల్లికి చెందిన శ్రవణ్ కుమార్ అనే ఎన్నారైకిచ్చి వివాహం చేసింది. 20 లక్షల నగదు,50 తులాల బంగారం కట్నంగా ఇవ్వడంతో పాటుపెళ్లి ఖర్చులు కూడా తానే భరించి 2015 లో ఘనంగా వివాహం చేసింది. 

అయితే వివాహమైన నెల రోజులకే శ్రావణ్ ఆస్ట్రేలియాకు వెళ్లిపోయాడు. వీసా వచ్చాక తనుశ్రీ ని తీసుకెళతానని నమ్మించాడు. అయితే అప్పటినుండి ఇలా మాయమాటలు చెబుతూ నమ్మించిన శ్రవణ్ గత సంవత్సరం నుండి ఫోన్ ని కూడా బ్లాక్ చేశాడు. అంతేకాకుండా అత్తింటివారు కూడా కనబడకుండా ఇంటికి తాళం వేసి మాయమయ్యారు.

దీంతో బాధితురాలు తనకు న్యాయం కావాలంటూ హన్మకొండ  వివేక్‌నగర్‌లోని అత్తారింటి ఎదుట నిరసనకు దిగింది. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు స్పందించకపోవడంతో ఇలా నిరసనకు దిగాల్సి వచ్చిందని బాధితురాలు వాపోతోంది. నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని బాధితురాలితో పాటు ఆమె తల్లి ఆవేధన వ్యక్తం చేస్తున్నారు.

loader