భర్తకు తెలీకుండా మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం ఎక్కడ భర్తకి తెలిసిపోతుందోనని భయపడింది. ఈ క్రమంలో భర్తను చంపేసి.. ప్రియుడితో సంతోషంగా ఉండాలని అనుకుంది. పథకం ప్రకారం భర్తను కిరాతకంగా హత్య చేయడానికి ప్లాన్ వేసింది. కానీ అది కాస్త బెడసి కొట్టింది. ఈ సంఘటన వికారాబాద్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఫరూక్‌నగర్‌ మండలం వెంకన్నగూడెంకు చెందిన కొడావత్‌ రాజు... కుటుంబ పోషణ నిమిత్తం హైదరాబాద్‌కు వలస వెళ్లాడు. బండ్లగూడలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా... రాజు భార్య శాంతికి  ఇటీవల ఫంక్షన్‌ హాల్‌ ఓనర్‌ ఎండీ యూసూఫ్‌తో పరిచయం ఏర్పడింది. వీరు పరిచయం కాస్తా ప్రేమగా ఏర్పడి వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది.

ఈ విషయం రాజుకి తెలిస్తే గొడవలు జరుగుతాయని భావించిన శాంతి, యూసూఫ్ లు.. అతని అడ్డు తొలగించుకోవాలని పథకం వేశారు. అందుకు శాంతి అన్న శ్రీను, యూసూప్‌ చిన్నాయన జహీరోద్దీన్‌ల సహకారం తీసుకున్నారు. నలుగురు కలిసి పక్కా ప్లాన్‌ వేశారు. 

ఈనెల 10న రాజుకు మాయమటలు చెప్పి బయటికి వెల్దామని ఆ నలుగురు చెప్పారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో హైదరాబాద్‌ నుంచి రాజుతో పాటు నలుగురు కారులో బయలుదేరారు. మార్గ మధ్యలో రాజుకు మందు తాగించారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో మండలంలోని నల్లమెట్టు అటవీ ప్రాంతానికి చేరుకున్నారు. రాజు దిగి మూత్రం పోస్తుండగా ఈ నలుగురు ఆయనను పొదల్లోకి లాక్కుపోయారు. చాక్‌తో గొంతు కోశారు.

తీవ్రమైన రక్తం కారడంతో రాజు చనిపోతాడని భావించి వదిలేశారు. రాజు నడుచుకుంటూ మరుసటి రోజు ఉదయం రోడ్డు పైకి వచ్చాడు. పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. చికిత్స నిమిత్తం రాజును హైదరాబాద్‌ ఈఎన్‌టీ ఆస్పత్రికి తరలించారు. నిందితుల కోసం పోలిసులు గాలింపు చర్యలు చేపట్టారు. తాజాగా నిందితులను అరెస్ట్ చేశారు.