చాటింగ్ పై తిట్టిన భర్త: ఇద్దరు పిల్లలతో భార్య అదృశ్యం

Wife missing after husband scolds her for chatting
Highlights

భర్త తిట్టాడనే కోపంతో భార్య తన ఇద్దరు పిల్లలను తీసుకుని కనిపించకుండా పోయింది. ఈ సంఘటన హైదరాబాదులోని జీడిమెట్లలో జరిగింది.

హైదరాబాద్: భర్త తిట్టాడనే కోపంతో భార్య తన ఇద్దరు పిల్లలను తీసుకుని కనిపించకుండా పోయింది. ఈ సంఘటన హైదరాబాదులోని జీడిమెట్లలో జరిగింది.

పల్లవి (29) తన భర్తో మురళీకృష్ణా రెడ్డితో కలిసి జీడిమెట్లలోని మల్లికార్జున నగర్ లో నివాసం ఉంటోంది. ఆమె ఇంట్లోనే ఉంటుంది. వారికి శాన్వి (3), మనస్విని (4) అనే కూతుళ్లు ఉన్నారు.

ఏప్రిల్ 16వ తేదీన మురళీకృష్ణ ఇంటికి వచ్చే సరికి పల్లవి ఫోన్ లో చాటింగ్ చేస్తూ కనిపించింది. దాంతో అతను మందలించాడు. ఆ తర్వాత ఏప్రిల్ 29వ తేదీన అలాగే చేస్తుంటే మందలించి ఆఫీసుకు వెళ్లిపోయాడు. 

రాత్రి ఇంటికి తిరిగి వచ్చేసరికి భార్యతో పాటు ఇద్దరు కూతుళ్లు కూడా కనిపించలేదు. దాంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

loader