ప్రియుడిపై మోజు: భర్తను చంపి శవాన్ని ముక్కలు చేసిన మరో స్వాతి

Wife kills husband with the help of lover in Nagarkurnool
Highlights

నాగర్‌కర్నూల్ లో భర్తను చంపిన మరో స్వాతి

నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లాలో మరో దారుణం చోటు చేసుకొంది. ప్రియుడి మోజులో పడి స్వాతి అనే మహిళ తన భర్త సుధాకర్ రెడ్డిని హత్య చేసింది. ఈ ఘటన మరువకముందే అదే తరహ ఘటన ఇదే జిల్లాలో చోటు చేసుకొంది. అయితే భర్తను హత్య చేసిన నిందితురాలు ఏమీ తెలియనట్టుగానే నటించింది.

నాగర్‌కర్నూల్ జిల్లాలోని  పార్వతమ్మ అనే వివాహిత తన భర్త మల్లయ్యను  ప్రియుడు రాములుతో  కలిసి హత్య చేసింది. మల్లయ్య మృతదేహన్ని ముక్కలు ముక్కలుగా నరికి  ఓ గోనెసంచిలో కట్టి  నాగర్ కర్నూల్ మండలంలోని నాగనూల్ చెరువులోని చెట్టుకు కట్టారు. ఈ మూట నీటిలో తేలకుండా ఉండేందుకు చెట్టుకు కట్టివేశారు.


సుమారు 20 ఏళ్ళ క్రితం మల్లయ్యకు  పార్వతమ్మకు వివాహమైంది.  వీరిద్దరికి ఓ కొడుకు కూడ ఉన్నాడు. అయితే మద్యానికి బానిసగా మారిన  మల్లయ్య భార్యను వేధింపులకు గురిచేసేవాడు. ఈ వేధింపులతో ఆమె విసిగిపోయింది. ఈ క్రమంలోనే ఆమెకు అదే గ్రామానికి చెందిన  రాములుతో వివాహేతర సంబంధం ఏర్పడింది.

అయితే ఈ వివాహేతర సంబంధం కారణంగా ప్రతిరోజూ వేధింపులకు గురిచేసే  భర్తను అడ్డుతప్పించుకోవాలని భార్య ప్లాన్ చేసింది. ఈ మేరకు 45 రోజుల క్రితం మల్లయ్యను ప్రియుడి సహయంతో చంపేసింది. మృతదేహన్ని  ముక్కలు ముక్కలుగా నరికి గోనెసంచిలో కట్టి నాగనూల్ చెరువులో వేశారు.

అయితే తన భర్త కన్పించడం లేదని పోలీసులకు నిందితురాలు ఫిర్యాదు చేసింది. భర్త కోసం వెతికింది. అయితే ఈ కేసు విషయమై విచారణ చేస్తున్న పోలీసులకు పార్వతమ్మపై అనుమానం వచ్చింది. ఆమె కాల్ డేటాను ఆధారంగా ఆమెను ప్రశ్నించారు. దీంతో అసలు విషయాన్ని ఆమె ఒప్పుకొంది.నాగనూల్ చెరువులోని గోనెసంచిలో మూట కట్టిన  మల్లయ్య మృతదేహన్ని  పోలీసులు బయటకు తీశారు.  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


 

loader