హైదరాబాద్: భర్తలను చంపిన భార్య ఉదంతాలు ఇటీవల చాలా వెలుగు చూస్తున్నాయి. తాజాగా మరో సంఘటన చోటు చేసుకుంది. హైదరాబాదులోని ఎర్రగడ్డలో భార్య తన భర్తను రాయితో కొట్టి చంపేసింది. 

స్వర్ణలత, భారయ్యల వివాహం 2013లో జరిగింది. బుధవారం రాత్రి భార్యాభర్తల మధ్య చిన్న గొడవ జరిగింది. దీంతో స్వర్ణలత రాయి తీసుకుని భర్తను కొట్టి చంపింది. భారయ్య (33) టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. ఎర్రగడ్డలోని డాన్ బోస్కో స్కూల్ వద్ద భార్యతో నివాసం ఉంటున్నాడు. 

బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో దంపతులకు మధ్య గొడవ జరిగింది. అర్థరాత్రి దాటిన తర్వాత 1 గంట వరకు గొడవ జరుగుతూ వచ్చింది. తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో స్వర్ణలత బయటకు వెళ్లి రాయి తెచ్చి, నిద్రలో ఉన్న బైరయ్య కొట్టి చంపింది. 

స్వర్ణలత మానసిక పరిస్థితి బాగా లేదని తెలుస్తోంది. దీంతో ఆమెను వైద్య పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దంపతులకు నాలుగున్నరేళ్ల కూతురు ఉంది.