Asianet News TeluguAsianet News Telugu

భర్తను గొంతు నులిమి చంపిన భార్య.. వివాహేతర సంబంధమే కారణం?

గోదావరిఖనిలో ఓ భార్య భర్తను గొంతు నులిమి హత్య చేసింది. ఈ దంపతుల మధ్య కొన్నాళ్లుగా గొడవలు తరుచూ జరుగుతున్నాయి. తాజాగా, జరిగిన గొడవలో భార్య శ్రావణి.. భర్త గొంతు నులిమేసి హతమార్చినట్టు తెలుస్తున్నది. భార్య భర్తల మధ్య గొడవలకు వివాహేతర సంబంధమే కారణం అనే అనుమానాలు స్థానికులు వెలువరుస్తున్నారు.

wife kills husband in godavarikhani.. extra marrital affair to blame?
Author
First Published Sep 6, 2022, 10:47 PM IST

హైదరాబాద్: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో దుర్ఘటన జరిగింది. వివాహేతర సంబంధం ఆ కాపురంలో చిచ్చు పెట్టింది. వివాహేతర సంబంధం కారణంగా ఆ భార్య భర్తల మధ్య తరుచూ గొడవలు జరిగాయి. చివరకు ఒకరు మరొకరిని చంపేసే దాకా పరిస్థితులు వెళ్లాయి. గోదావరిఖని ఎన్‌టీపీసీ ఆటో నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఎన్‌టీపీసీ ఆటోనగర్‌లో శ్రావణి, తన భర్తతో కాపురం ఉంటున్నది. వారికి ఎనిమిదేళ్ల క్రితం పెళ్లి అయింది. వారు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ ఎనిమిదేళ్ల కాపురంలో వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అంతా సజావుగా సాగుతున్నదని అనుకుంటున్న తరుణంలో భార్య భర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. గత కొన్ని రోజులుగా భార్య భర్తల మధ్య గొడవలు తీవ్రంగా జరుగుతున్నాయి. ఇదే క్రమంలో తాజాగా ఓ గొడవ జరిగింది. ఈ ఘర్షణలోనే భార్య శ్రావణి.. భర్త గొంతు నులిమేసింది. భర్త గొంతు నులిమి హత్య చేసినట్లు తెలుస్తున్నది. భర్తను హతమార్చడానికి అక్రమ సంబంధమే కారణం అనే అనుమానాలు వస్తున్నాయి. పోలీసులకు ఈ విషయం తెలియగానే ఘటనా స్థలానికి చేరుకున్నారు. దర్యాప్తు ప్రారంభించారు.

Follow Us:
Download App:
  • android
  • ios