రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో  దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ తన భర్తను కత్తితో పొడిచి హత్య చేసింది. 

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ తన భర్తను కత్తితో పొడిచి హత్య చేసింది. అయితే భర్త తాగొచ్చి కొట్టడం వల్లే మహిళ అతడిపై కత్తితో దాడి చేసినట్టుగా తెలుస్తోంది. వివరాలు.. బాధితుడు వి రాజు తన భార్య జ్యోతితో కలిసి శంషాబాద్ మండలంలోని నానాజీపూర్ నివసిస్తున్నాడు. శనివారం రాత్రి రాజు మద్యం సేవించి మత్తులో ఇంటికి వచ్చాడు. ఏదో విషయమై భార్యతో గొడవపడి ఆమెను కొట్టినట్టుగా తెలుస్తోంది. అయితే ఆవేశంతో జ్యోతి కత్తి తీసుకుని రాజును పొడిచింది. రాజు ఘటన స్థలంలోనే చనిపోయాడు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. జ్యోతిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టుగా పోలీసులు తెలిపారు.