Asianet News TeluguAsianet News Telugu

అర్థనగ్నంగా ఉండమంటాడు.. మూత్రం తాగమంటాడు.. ఓ భర్త పైశాచికత్వం...

భర్త మరీ దారుణం Half nakedగా కూర్చోవాలని వేదించేవాడు. అంతకంటే దారుణం మూత్రం తాగాలని బలవంతం చేసేవాడు. ఈ మేరకు నిందితులపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. 

Wife Files Harassment Complaint Against Husband in Hyderabad
Author
Hyderabad, First Published Oct 29, 2021, 7:33 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

జూబ్లీహిల్స్ : ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యకు ఓ భర్త నరకం చూపించాడు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు మరో మచ్చు తునక ఈ ఘటన. వేరే కులం, తక్కువ కులం అమ్మాయి అని.. కులం పేరుతో దూషించడం మొదలుపెట్టాడు. దీనికి తోడు అబార్షన్లు చేయించి చిత్రహింసలు గురిచేశాడు. అంతటితో ఆగలేదు కుటుంబమంతా కలిసి వేదించారు. 

దీంతో ఆ మహిళ తట్టుకోలేక... తనను కులం పేరుతో దూషిస్తూ, తీవ్రంగా కొడుతూ.. అర్థ నగ్నంగా ఉండమంటాడని, urine తాగాలని బలవంతం చేస్తాడని ఓ మహిళ తన భర్త ఆగడాలపై జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. 

అతని కుటుంబ సభ్యులూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసుల కథనం ప్రకారం.. నారాయణపేట మక్తల్ కు చెందిన మహిళ రహమత్ నగర్ లో నివసిస్తుంది. ఆమె 2016లో ఓ యువకుడిని ప్రేమించి, పెళ్లి చేసుకుంది. 

ఆ తరువాత ఆమె గర్భం దాల్చింది. అయితే ఇప్పుడే పిల్లలు వద్దూ అంటూ ఆమెకు abortion చేయించారు. 2020లో భర్త సోదరుడు, సోదరి, బావ ఆమెను cast పేరుతో దూషించేవారు. పలుమార్లు పెట్రోల్ పోసి చంపేస్తామంటూ బెదిరింపులకు దిగేవారు.

దీంతో ప్రేమ, పెళ్లి కట్నం లేకపోవడంతో సతాయిస్తున్నారని.. భర్తకు రూ.1.50 లక్షలు ఇచ్చింది. ఆ తర్వాత కూడా వేధింపులు ఆపలేదు. ఇక భర్త మరీ దారుణం Half nakedగా కూర్చోవాలని వేదించేవాడు. అంతకంటే దారుణం మూత్రం తాగాలని బలవంతం చేసేవాడు. ఈ మేరకు నిందితులపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. 

హైదరాబాద్ లో ప్రేమోన్మాది ఘాతుకం... కత్తితో యువతి గొంతు, మణికట్టు కోసి హత్యాయత్నం

పెళ్లైన నెలకే భర్త వివాహేతర సంబంధం..
గుంటూరు జిల్లా పెద్దపరిమికి చెందిన ప్రకాశ్‌కు అదే జిల్లాకు చెందిన త్రివేణితో 2019లో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో త్రివేణి కుటుంబ సభ్యలు.. ప్రకాశ్‌కు కట్నంగా రూ. 20 లక్షల నగదు, 30 సవర్లబంగారు ఆభరణాలు, 3 ఎకరాల భూమి ఇచ్చారు. 

ప్రకాశ్ బంజారాహిల్స్‌లోని ఓ సాఫ్టవేర్ కంపెనీలో చార్టర్డ్ అకౌంటెంటుగా పనిచేస్తున్నాడు. పెళ్లి జరిగాక.. కొన్ని రోజులు మాత్రమే వీరి కాపురం హ్యాపీగా సాగింది. ఎన్నో ఆశలతో భర్తతో జీవితాన్ని ఊహించుకున్న త్రివేణికి.. నెల రోజులకే షాక్ తగిలింది. 

ప్రకాశ్.. ఆమెను దూరం పెట్టడం మొదలుపెట్టాడు. త్రివేణిని హైదరాబాద్‌కు తీసుకుని వచ్చాక.. ఆమెను వేధించడం స్టార్ట్ చేశారు. అకారణంగా ఆమెను హింసించేవాడని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. భార్యభర్తలు ఏకాంతంగా ఉన్న ఫొటోలను ప్రకాశ్ అతని స్నేహితులకు చూపించేవాడని కన్నీరు పెట్టుకుంది. 

ప్రకాశ్ వేధింపులు తట్టుకోలేక త్రివేణి Suicide Attempt చేశానని.. అయితే ప్రకాశ్ ఈ విషయాన్ని కూడా పట్టించుకోలేదని ఆరోపించింది. చాలా సందర్బాల్లో ప్రకాశ్ రాత్రిళ్లు ఇంటికి కూడా వచ్చేవాడు కాదని ఆమె తెలిపింది. ఇక, ఆరు నెలలుగా ప్రకాశ్ త్రివేణిని అసలు పట్టించుకోకుండా తిరుగుతున్నాడని ఆమె కుటుంసభ్యులు తెలిపారు. 

జగిత్యాలలో ఘోరం... ఒకేసారి ఇద్దరు వివాహితలు, ఓ ఇంటర్ యువతి ఆత్మహత్య

ఇటీవల భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే సంగతి తెలిసింది. దీంతో ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలిపింది. వారితో కలిసి ప్రకాశ్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలని భావించింది. 

ఈ క్రమంలోనే బుధవారం రాత్రి కేపీహెచ్‌బీ తులసీనగర్‌లో ప్రకాశ్, మరో మహిళతో ఉండగా త్రివేణి తన కుటుంబ సభ్యులతో కలిసి అక్కడికి వెళ్లింది. ప్రకాశ్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని చితకబాదింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ప్రకాశ్‌ను, మరో మహిళను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios