భువనగరి: భార్య, పిల్లలు ఉండగానే  మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొన్న హరిప్రసాద్ అనే వ్యక్తిని భార్య రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొంది. అంతేకాదు పోలీసులకు అప్పగించింది. తనకు న్యాయం చేయాలని ఆమె కోరుతోంది.

 యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో  ఏఓగా పనిచేస్తూ హరిప్రసాద్ అనే వ్యక్తి సస్పెన్షన్‌కు గురయ్యాడు.  హరిప్రసాద్‌కు నిర్మల అనే మహిళకు 2002లో వివాహమైంది.  వీరికి పిల్లలు కూడ ఉన్నారు.

రెండేళ్ళ క్రితం మరో మహిళతో  తన భర్తకు వివాహేతర సంబంధం ఏర్పడిందని  నిర్మల ఆరోపిస్తున్నారు. గతంలో కూడ ఈ విషయమై పంచాయితీలు నిర్వహించినట్టు చెప్పారు. అయితే తాము ఇక కలుసుకోమని ఇద్దరూ కూడ ఒప్పంద పత్రాలు రాసుకొన్న విషయాన్ని కూడ ఆమె చెప్పారు.

కానీ, ఒప్పందాలను ఉల్లంఘిస్తూ తన భర్త హరిప్రసాద్  విహహేతర సంబంధం కలిగి ఉన్న మహిళతో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నాడని భార్య నిర్మల ఆరోపిస్తున్నారు. తన కొడుకు  యాక్సిడెంట్ జరిగి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతోంటే పట్టించుకోకుండా వివాహేతర సంబంధం కలిగి ఉన్న మహిళ వద్దకు వెళ్లాడని ఆమె ఆరోపించారు.

శనివారం నాడు ఉదయం సోదరుడితో కలిసి వచ్చిన నిర్మల మరో మహిళతో హరిప్రసాద్ ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొంది. దేహశుద్ది చేసి  పోలీసులకు అప్పగించారు. హరిప్రసాద్ భార్య రమ ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తోంది.

మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొన్న హరిప్రసాద్ తనతో పాటు తన పిల్లలపై దాడులు చేస్తున్నాడని నిర్మల ఆరోపించారు.వివాహేతర సంబంధం గురించి నిలదీస్తే తమ మధ్య ఎలాంటి సంబంధం లేదని బాండ్ పేపర్లు కూడ రాసిచ్చారని నిర్మల గుర్తు చేశారు.  ఈ విషయమై నిర్మల పోలీసులకు ఫిర్యాదు చేశారు.