ప్రేమించినప్పుడు అందంగా కనిపించిన అమ్మాయి.. పెళ్లైన తరువాత అందవికారంగా కనిపించింది.. ఓ భర్తకు.. అంతే మానసికంగా, శారీరకంగా వేధింపులు మొదలుపెట్టాడు.. ప్రాణప్రదంగా ప్రేమించిన వ్యక్తే అలా చేయడంతో తట్టుకోలేని ఆ భార్య...
తాండూరు : వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఇష్టాయిష్టాలు పంచుకున్నారు. marriage చేసుకుని రెండేళ్లు తిరగకుండానే. అందంగా లేవంటూ అతడు Harassment మొదలుపెట్టాడు. బంధువులు, పెద్దలు సమస్యను పరిష్కరించ లేకపోవడంతో.. చేసేదేం లేక, పాలుపోక ఆమె Forced deathకి పాల్పడింది. Tandurలో వెలుగుచూసిన ఈ ఉదంతంలో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు మండలం జిన్ గుర్తి కి చెందిన మహేష్, యాలాల మండలం దేవనూరు గ్రామానికి చెందిన సునీత (23) ఇద్దరూ.. ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు.
కొన్నేళ్లు జీవితం అన్యోన్యంగానే కొనసాగింది. ఆ తర్వాత వారి మధ్య విభేదాలు మొదలయ్యాయి. Beautyగా లేవని, శారీరకంగా, మానసికంగా నిత్యం వేధించడమే కాకుండా.. చేయి చేసుకోవడం ప్రారంభించాడు. తన ఆవేదనను పలుసార్లు కుటుంబసభ్యులు, బంధువులతో చెప్పుకునే ఆమె విలపించేది. ఇటీవల భర్త వేధింపులు అధికమయ్యాయి. దీంతో చనిపోవాలని నిర్ణయం తీసుకుంది. గురువారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరి వేసుకుని suicideకు పాల్పడింది.
బయటికి వెళ్లిన భర్త.. తిరిగి వచ్చి చూసేసరికి అప్పటికే ఆమె మృతి చెందినట్లు గుర్తించాడు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాలని ప్రయత్నించినా వీలు కాకపోవడంతో మృతురాలి కుటుంబ సభ్యులకు చెప్పాడు. భర్త వేధింపులు తాళలేకనే ఆత్మహత్య చేసుకుందని సోదరి అనిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మధుసూదన్ రెడ్డి తెలిపారు.
కాగా, జనవరి 29న ఓ భర్త భార్య సమాధి వద్దే సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. nellore district ఆత్మకూరు పట్టణానికి చెందిన Penchalaya అనే వ్యక్తి భార్య సమాధి వద్ద పురుగుల మందు తాగి suicide attemptకి పాల్పడ్డాడు. అయితే ఇదంతా Selfie video తీసుకుని whatsapp లో షేర్ చేయడంతో సంచలనంగా మారింది. గతంలో అతడి భార్య suicide చేసుకుంటుంటే పెంచలయ్య వీడియో తీయడం అప్పట్లో సంచలనం సృష్టించింది.
పెంచలయ్య ఆత్మకూరులోని ఓ బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తుంటాడు. భర్త వేధింపులు భరించలేక భార్య కొండమ్మ నిరుడు సెప్టెంబర్ 21న ఆత్మహత్య చేసుకుంది. ఈ క్రమంలో భార్య సమాధి వద్దకు వెళ్లిన పెంచలయ్య.. తన భార్య చావుకు, తన చావుకు ఆరుగురు కారణమంటూ సూసైడ్ నోట్ రాయడం గమనార్హం. ఇదే విషయాలను చెబుతూ సెల్ఫీ వీడియో తీసి వాట్స్అప్ గ్రూపులో షేర్ చేశాడు.
ఆ తర్వాత పురుగుల మందు తాగడంతో స్పృహతప్పి పడిపోయాడు. ఆ వీడియో చూసిన వారు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఆత్మకూరు ఎస్సై శివశంకర్ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుడిని వైద్యం నిమిత్తం జిల్లా వైద్యశాలకు తరలించారు. ప్రధమ చికిత్స తర్వాత మెరుగైన వైద్య సేవల కోసం నెల్లూరుకు తరలించారు. ప్రస్తుతం పెంచలయ్య ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, నిరుడు సెప్టెంబర్ 21న నెల్లూరు జిల్లా ఆత్మకూరులో భర్త ఎదుటే ఉరివేసుకుని భార్య ఆత్మహత్య చేసుకుంది. భార్య ఉరి వేసుకుంటుంటే ఆపాల్సింది పోయి వీడియో తీశాడు ఆ భర్త. ఆ తరువాత ఈ వీడియో వైరల్ కావడంతో... విషయం తెలుసుకున్న పోలీసులు భర్త పెంచలయ్యను అరెస్టు చేశారు.
