నల్గొండ: మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొన్న భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొంది ఓ భార్య. అంతేకాదు అక్కడే భర్తను చితకబాదింది.  ఈ ఘటన నల్గొండలో చోటు చేసుకొంది.

నల్గొండ జిల్లాలోని కనగల్ మండలం ధర్వేశిపురం గ్రామానికి చెందిన మాధవి అనే మహిళతో చిట్యాల మండలం ఎలికట్టెకు చెందిన సాయిబాబాతో 2011లో వివాహమైంది. అయితే కొంతకాలం వీరి కాపురం సజావుగా సాగింది.

కారు డ్రైవర్ గా సాయిబాబా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే భర్త చనిపోయిన మరో మహిళతో సహ జీవనం చేస్తున్నాడు. దీంతో తన భార్యను పట్టించుకోవడం లేదు. ఈ విషయమై బంధువులను తీసుకొని మాధవి తన భర్త సహజీవనం చేస్తూ ఉంటున్న ఇంటికి ఆదివారం నాడు ఉదయం చేరుకొంది.

మరో మహిళతో ఉన్న భర్త సాయిబాబాను మాధవి రెడ్ హ్యాండెడ్  గా పట్టుకొంది. మరో మహిళతో ఉన్న భర్తను చితకబాదింది. ఈ విషయం తెలుసుకొన్న పోలీసులు అక్కడికి చేరుకొన్నారు. పోలీసులు ఉన్నా కూడ మాధవితో పాటు ఆమె బంధువులు కూడ సాయిబాబాను చితకబాదారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.