Asianet News TeluguAsianet News Telugu

ఇతర మహిళలతో ఉన్న వీడియోలు తీసి.. భార్యకు చూపించి పైశాచికానందం.. దీంతో ఆ భార్య చేసిన పని..

భర్త పైశాచికత్వాన్ని భరించలేక ఓ భార్య దారుణానికి ఒడి గట్టింది. పాలలో నిద్రమాత్రలు కలిపి హతమార్చి.. మిస్సింగ్ కేసు నమోదు చేసింది. చివరికి.. 

wife assassinated husband over illegal affair in warangal
Author
First Published Dec 19, 2022, 6:59 AM IST

కాజీపేట : ఓ భార్య తన భర్త ను దారుణంగా హతమార్చింది. భర్త వేధింపులు తట్టుకోలేక ఈ దారుణమైన పనికి పూనుకుంది. పరాయి స్త్రీలతో భర్త కలిసి ఉండడమే కాకుండా, వాటిని వీడియోలు తీసి భార్యకు చూపిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు. ఈ వేధింపులు తట్టుకోలేక ఆ భార్య ఆవేశంతో భర్తను హత్య చేసింది. వరంగల్ జిల్లా కాజీపేటలో ఈ దారుణం జరిగింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ కేసులో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.  వీరిలో భార్య జన్నారపు సుస్మితతో సహా…  కటకం నవిన్, రత్నాకర్,  కొంగర అనిల్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం హత్య కేసు ఛేదించిన తర్వాత పోలీసులు కాజీపేట పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. 

ఈ మేరకు మీడియాకు సెంట్రల్ జోన్ డీసీపీ అశోక్ కుమార్ కాజీపేట ఏసిపి పి శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. జన్నారపు వేణు కుమార్,  జన్నారపు సుస్మిత భార్యాభర్తలు. వీరిది మహబూబాద్ బాద్. వేణు కుమార్ చిట్ఫండ్ వ్యాపారం చేస్తుంటాడు.  సుస్మిత రైల్వే లోకో షెడ్ లో టెక్నీషియన్గా పని చేస్తోంది.  వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.  స్వస్థలం మహబూబాబాద్ అయినా, కాజీపేటలోని డీజిల్ కాలనీ లో ఉంటున్నారు. 

కాగా పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్న వేణు కుమార్ మరో యువతిని రెండో వివాహం చేసుకున్నాడు. మొదట్లో కొద్దిరోజులు గొడవపడ్డ ఆ తర్వాత సుస్మిత భర్తతో సర్దుకు పోయింది. రెండు పెళ్లిళ్లతో వేణు కుమార్ ఆగలేదు. వేరో మహిళలతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతోపాటు వారితో కలిసి ఉన్న వీడియోలు తీసేవాడు. వాటిని తరచూ సుస్మితకు చూపించేవాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. అయినా వేణు కుమార్ లో ఎలాంటి మార్పు రాలేదు. మానసిక వేదనను హింసలు భరించలేక సుస్మిత భర్తను కడతేర్చిన నిర్ణయించుకుంది.  దీనికి తన బంధువుల సహాయం తీసుకుంది. 

దగ్గరి బంధువైన కొంగర అనిల్ కు తన వేదనను చెప్పుకుంది. భర్తను హతమార్చాలని  చెప్పింది. జయశంకర్ జిల్లా మొగుళ్లపల్లి మండలం సిద్దిపేట గ్రామానికి చెందిన గడ్డం రత్నాకర్ కు కొంగర అనిల్ కలిశాడు.  సుస్మిత  భర్త  వేణు కుమార్ ను చంపడానికి సుపారీ మాట్లాడుకున్నారు. రూ. 4 లక్షలకు బేరం కుదుర్చుకుని.. రూ.2 లక్షలు  చెల్లించాడు. దీంతో వీరు ఓ పథకం వేశారు. దీని ప్రకారం గత సెప్టెంబర్ 30న సుస్మిత పాలలో నిద్రమాత్రలు కలిపింది. ఆ పాలను వేణు కుమార్ చేత తాగించింది. అది తాగిన వెంటనే ఘాడ నిద్ర లోకి వెళ్ళిపోయాడు.  వెంటనే గడ్డం రత్నాకర్కు ఫోన్ చేసింది. అతను వేణు కుమార్ ను కారు వెనుక సీట్లో కూర్చోబెట్టుకున్నాడు. అతనితోపాటు బయలుదేరారు. 

కటిక నవీన్ మధ్యలో వీరితో  కలిశాడు. ఇక మంథనికి వెళ్ళిన తరువాత వేణు కుమార్ బట్టలన్ని విప్పేసి.. అతడిని మానేరు వాగు లో పడేశారు. నిద్ర మత్తులో ఉండడంతో  అలాగే మునిగి చనిపోయాడు. ఆ తర్వాత అక్టోబర్ 3న వేణు కుమార్ మృతదేహం లభించింది.  దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. ముందుగా  వేసుకున్న పథకం ప్రకారం సుస్మిత  అక్టోబర్ 7వ దేవి నా భర్త కనిపించడం లేదంటూ  కాజిపేట్ పోలీస్ స్టే షన్లో ఫిర్యాదు చేసింది. కాజీపేట ఏసిపి శ్రీనివాస్ ఆధ్వర్యంలో  ఇన్స్పెక్టర్ గట్ల మహేందర్రెడ్డి దర్యాప్తు మొదలుపెట్టారు. 

సుస్మిత  ఫిర్యాదు చేసిన తర్వాత భర్త ఆచూకీ కోసం పదేపదే పోలీస్ స్టేషన్కు వస్తుండేది.  దీంతో పోలీసులు ఆమెపై అనుమానం కలిగింది. ఆ కోణం నుంచి దర్యాప్తు మొదలుపెట్టారు.  సుస్మిత,  అనిల్ కాల్ డేటా లను పోలీసులు పరిశీలించారు. రౌడీ షీటర్ గడ్డం రత్నాకర్ తో మాట్లాడినట్లు తేలింది. దీనికి సంబంధించిన ఆడియో రికార్డులను  పోలీసులు సంపాదించారు. వీటి ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల  విచారణలో వీరు  నిజం ఒప్పుకున్నారు.  వేణు కుమార్ ను తామే పథకం ప్రకారం హత్య చేశామని అంగీకరించారు. హత్య చేసిన విధానం   చెప్పారు. దీంతో ఈ నిందితుల నుంచి నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసును ఛేదించారు.

Follow Us:
Download App:
  • android
  • ios