Asianet News TeluguAsianet News Telugu

స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం.. చంపి, చేపలచెరువులో పడేసిన ప్రియుడు...

ప్రేమించి, పెళ్లి చేసుకున్న భర్తను వివాహేతర సంబంధం మోజులో దారుణంగా చంపించింది. ప్రియుడు భర్తను చంపి చేపల చెరువులో పడేసినా ఏమీ తెలియనట్టుగా ఉండిపోయింది. చివరకు...

wife and paramour killed husband over extramarital affair in khammam
Author
First Published Aug 25, 2022, 7:25 AM IST

ఖమ్మం : వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను అంతమొందించేందుకు ప్రియుడితో కలిసి దారుణానికి దిగింది ఓ భార్య. కిరాతకంగా భర్తను హత్య చేయడమే కాకుండా, మృతదేహం దొరకకుండా చేపల చెరువు లో పడేశారు. ఈ ఘటన పోలీసులనే ఆశ్చర్యానికి గురి చేసింది. ఖమ్మం గ్రామీణ మండలం ఆరెంపులకు చెందిన సాయి చరణ్(28), కొనిజర్ల మండలానికి చెందిన ఓ యువతి (25) నాలుగేళ్ల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నారు. సాయి చరణ్ ఖమ్మంలో చికెన్ వ్యర్థాలు తరలించే వెహికల్ డ్రైవర్ గా పనిచేస్తుండేవాడు. అదే  వాహనంలో మరో యువకుడు కరుణాకర్ (30) సాయితో కలిసి పని చేసేవాడు.

ఇద్దరి మధ్య స్నేహంతో తరచూ కరుణాకర్ సాయి ఇంటికి వచ్చేవాడు.ఈ నేపథ్యంలోనే సాయి భార్యతో కరుణాకర్ కి పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం సాయికి తెలిసి భార్యతో అనేక సార్లు గొడవ పడ్డారు. భర్తకు విషయం తెలిసిందని ఇంకా ఎవరికైనా తెలిస్తే పరువు పోతుందని భావించింది భార్య. ప్రియుడితో కలిసి సాయిని అంతమొందించాలని పథకం వేశారు. ఈ నేపథ్యంలోనే ఈ హత్య చోటు చేసుకుంది. 

హైద్రాబాద్ పాతబస్తీలో రంగంలోకి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్: ఏడు గంటలకే దుకాణాలు మూసివేయాలని ఆదేశం

చేపల చెరువులో…
ఆగస్టు 1న రాత్రి చికెన్ వ్యర్థాలు తీసుకువెళ్లేందుకు వీరిద్దరు మరో ఇద్దరు డ్రైవర్లతో కలిసి మద్యం తాగారు. ఈ సమయంలోనే ఎందుకు తన భార్యతో చనువుగా ఉంటున్నామని కరుణాకర్ ని సాయి నిలదీశాడు. ఈ నేపథ్యంలో మాటా మాటా పెరగడంతో మద్యం మత్తులో ఉన్న కరుణాకర్  బలంగా తోసేయడంతో సాయి ట్రాలీ ఆటోకు కొట్టుకున్నాడు. ఆ తర్వాత పారతో సాయిని బలంగా కొట్టడంతో అక్కడికక్కడే చనిపోయాడు. హత్య మీద ఎవరికీ అనుమానం రావద్దని చికెన్ వ్యర్థాలు తరలించే వాహనంలో మృతదేహాన్ని పడేశాడు. మృతదేహాన్ని మూటగట్టి వ్యర్థాలతో పాటు వాహనంలో వేసుకున్నాడు.

ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం కుదప గ్రామానికి తీసుకువెళ్ళాడు. అక్కడి ప్రైవేటు చేపల చెరువు లో మృతదేహాన్ని పడేశాడు. మృతదేహం పైకి తేలకుండా బలమైన రాయి కట్టాడు. అయినా కూడా మూడు రోజుల తర్వాత మృతదేహం పైకి తేలింది.  మృతదేహంపైకి తేలడం గమనించిన చేపల చెరువు యజమాని కరుణాకర్ కు ఫోన్ చేశాడు. అక్కడికి వెళ్ళిన కరుణాకర్ మృతదేహాన్ని పక్కనే ఉన్న ఊరి చెరువులో పడేసి వచ్చేశాడు. సాయిని హత్య చేసిన విషయం అతని భార్యకు చెప్పాడు.  ఆమె కోరుకున్నదీ అదే కాబట్టి.. ఏమీ మాట్లాడతేదు. ఆ తర్వాత ఇద్దరూ తమకు ఏమీ తెలియనట్టుగా ఉండిపోయారు.

పోలీసుల అదుపులో…
ఆగస్ట్ 1న సాయి హత్య జరిగినా..  సుమారు 10 రోజులు ఎక్కడా బయటకు రాలేదు. సాయి ఎక్కడికి వెళ్ళాడు అని అతని బంధువులు, యజమాని  భార్యను అడిగారు. ఎక్కడికి వెళ్ళాడో తనకు కూడా చెప్పలేదని  చెబుతూ వచ్చింది. భర్త హత్యకు గురైనట్లు ఖమ్మం రెండో పట్టణ ఠాణాలో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సాయి ఫోన్ కాల్ లిస్టు ఆధారంగా విచారణ చేశారు. ఆ తర్వాత భార్య ఫోన్ కాల్ లిస్టును పరిశీలించారు. కరుణాకర్ తో ఎక్కువసార్లు మాట్లాడినట్లు గుర్తించారు.

దీంతో అనుమానం వచ్చి కరుణాకర్ ను తీసుకొచ్చి విచారించగా అసలు విషయం అంగీకరించాడు. మృతదేహం కోసం పోలీసులు మూడు, నాలుగు సార్లు ఏపీ వెళ్లారు. అయినా కూడా దొరకలేదు. కరుణాకర్, సాయి భార్యతోపాటు హత్యకు సహకరించిన మరో ఇద్దరు పోలీసుల అదుపులోనే  ఉన్నారు. హత్య జరిగి 25 రోజులు అవుతున్న మృతదేహం లభ్యం కాకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios