హైదరాబాద్ లో విషాద సంఘటన చోటుచేసుకుంది. కుటుంబాన్ని వెంటాడుతున్న ఆర్థిక కష్టాల కారణంగా ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడగా...భార్య మృతిని తట్టుకోలేక  భర్త కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. భార్యాభర్తల ఆత్మహత్యలతో కూకట్ పల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఈ విషాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. బాపయ్య చౌదరి, శిరీషలు భార్యాభర్తలు. వీరు కూకట్ పల్లిలో నివాసముండే ఈ దంపతులు ఎంతో ఆనందంగా జీవించచేవారు. అయితే హటాత్తుగా వీరి కుటుంబాన్ని ఆర్థిక కష్టాలు ముట్టడించాయి. వీటిని తట్టుకోలేక ఇవాళ శిరీష ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 

భార్య చనిపోయిందన్న వార్త తెలుసుకుని భర్త బాపయ్యచౌదరి కూడా తీవ్ర మనోవేధనకు గురయ్యాడు. భార్య లేకుండా బ్రతకడం దండగని భావించిన అతడు సనత్‌నగర్ రైల్వేస్టేషన్ దగ్గర రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇలా భార్యాభర్తల ఒకేరోజు ఆత్మహత్యలకు పాల్పడం కుటుంబసభ్యులనే కాదు వారు నివాసముండే కాలనీవాసులను కలచివేసింది. 

ఈ ఆత్మహత్యలపై సమాచారం అందుకునన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే వీరి ఆర్థిక కష్టాలకు షేర్ మార్కెట్ పెట్టబడులే కారణమై ఉంటాయని కుటుంబ  సభ్యులు అభిప్రాయపడుతున్నారు.