మేడ్చెల్: తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చెల్ జిల్లాలో దారుణమైన సంఘటన జరిగింది. మహిళపై ఆగ్రహంతో ఓ వ్యక్తి ఆమె ఆరేళ్ల కూతురిని గొంతు కోసి హత్య చేశాడు. ఆమె మరో వ్యక్తితో సాన్నిహిత్యాన్ని పెంచుకుని, తనను పట్టించుకోవడం లేదనే కోపంతో అతను ఆ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. వీఆర్వో కల్యాణ్, అతని భార్య అనూషల కూతురిని కరుణాకర్ అనే వ్యక్తి చంపాడు. ఆ తర్వాత తాను ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కరుణాకర్ కు, అనూషకు మధ్య కొన్నాళ్లుగా పరిచయం ఉంది. మరో వ్యక్తితో సాన్నిహిత్యం పెంచుకుందనే కోపంతో ఆ దురాగతానికి పాల్పడినట్లు తెలుస్తోంది. 

మేడ్చెల్ జిల్లా ఘట్కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఇస్మాయిల్ ఖాన్ గుడా విహారీ హోమ్స్ లో ఆ సంఘటన జరిగింది. మహిళ ఓ యువకుడు ఉండడాన్ని గర్తించిన కరుణాకర్ ఆమె కూతురు ఆద్యను చంపినట్లు తెలస్తోంది. కల్యాణ్ కు ఈ సంఘటనతో సంబంధం లేనట్లు తెలుస్తోంది.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని కరుణాకర్ గా గుర్తించారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. మరో వ్యక్తితో కూడా అక్రమ సంబంధం పెట్టుకుందనే కోపంతో ఆమె కూతురిపై అతను కక్ష పెంచుకుంటున్నట్లు తెలుస్తోంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతురాలిని ఆద్యగా గుర్తించారు. కరుణాకర్ ను పోలీసులు ఆస్పత్రికి తరలించారు.