హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రహస్యంగా ఎందుకు సమావేశమయ్యారో చెప్పాలని మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత దానం నాగేందర్ డిమాండ్ చేశారు.

సోమవారం నాడు ఆయన హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు.  ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా  కొంగర కలాన్ లో  సభ జరిగితే  కళ్లుండి కూడ చూడలేని విధంగా  కాంగ్రెస్ నేతలు  తప్పుడు ప్రచారం చేస్తున్నారని  ఆయన విమర్శలు గుప్పించారు. 

ఉత్తమ్ హటావో... కాంగ్రెస్ బచావో అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలే బహిరంగంగా ప్రచారం చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.  కొంగరకలాన్ లో  టీఆర్ఎస్ నిర్వహించిన సభ సక్సెస్ అయితే  సభ ప్లాప్ అయిందని  ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమాటలు చెబుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇతర పార్టీల నుండి కూడ చాలా మంది టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్దంగా ఉన్నారని.. కానీ, టీఆర్ఎస్ లో  ఖాలీ లేదని దానం నాగేందర్ చెప్పారు. బీజేపీకి తెలంగాణలో ఒక్క సీటు కూడ రాదని  ప్రధానమంత్రికి  ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారని ఆయన తెలిపారు.

ఈ వార్త చదవండి

సీనియర్లు కారెక్కుతారు, రెండు రోజుల్లో జాబితా: దానం సంచలనం