హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలోని పెద్ద తలకాయలు  టీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్దంగా ఉన్నారని మాజీ మంత్రి టీఆర్ఎస్ నేత  దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  కాంగ్రెస్ పార్టీని నుండి టీఆర్ఎస్ లో చేరే  నేతల జాబితాను రెండు రోజుల్లో  బయటపెడతానని ఆయన ప్రకటించారు.

తెలంగాణలో టీఆర్ఎస్ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పెద్ద ఎత్తున తమ పార్టీలో చేరేందుకు నేతలు, కార్యకర్తలు క్యూ కడుతున్నారని ఆయన చెప్పారు.  కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్ద నాయకులు కూడ   టీఆర్ఎస్ లో చేరేందుకు  సిద్దంగా ఉన్నారని ఆయన చెప్పారు.

కాంగ్రెస్ పార్టీలో  పెద్ద తలకాయలుగా వెలుగొందున్న నేతలు  తమ పార్టీలో చేరేందుకు ఆసక్తిని చూపుతున్నారన్నారు.  రెండు రోజుల్లో కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ లో చేరే నేతల పేర్లను బయటపెడతానని ఆయన చెప్పారు. 

ఈ జాబితా చూస్తే కాంగ్రెస్ పార్టీ నేతలు దిమ్మ తిరిగి షాకవుతారన్నారు. గాంధీ భవన్‌లో ఇమడలేక ప్రతి రోజూ గొడవలకు తోడు.. సరైన ప్రాతినిథ్యం లేక ఆ పార్టీ నేతలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన చెప్పారు. పార్టీ అధిష్టానం ఆదిశిస్తే హైద్రాబాద్‌లో ఎక్కడినుండైనా పోటీ చేస్తానని దానం చెప్పారు.