హైదరాబాద్: తెలంగాణలో న్యూ ఇయర్ వేడుకలను ఎందుకు బ్యాన్ చేయలేదని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 

మీడియాలో కథనాలను చూసి సుమోటోగా హైకోర్టు గురువారం నాడు ఈ విషయమై విచారణ చేసింది. కొత్త వైరస్ డేంజర్ అంటూనే వేడుకలకు ఎలా అనుమతి ఇచ్చారని హైకోర్టు ప్రశ్నించింది. 

పబ్ లు, బార్లు విచ్చలవిడిగా ఓపెన్ ఏం చేయాలనుకొంటున్నారని హైకోర్టు అడిగింది. ఇప్పటికే రాజస్థాన్, మహారాష్ట్రలో న్యూ ఇయర్ వేడుకలపై బ్యాన్ ఉన్న విషయాన్ని హైకోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది.తెలంగాణ ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని హైకోర్టు ప్రశ్నించింది.ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ ను మూసివేస్తే సరిపోదన్నారు. ఈ రోజు రాత్రి 144 సెక్షన్ విధించే అవకాశాలను కూడా పరిశీలించాలని పేర్కొంది. 

కొత్త సంవత్సరం నేపథ్యంలో  ఇవాళ రాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాలకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం, ఇవాళ రాత్రి 1 గంట వరకు పబ్ లు, క్లబ్బులను తెరిచే ఉంచనున్నారు. 

ఇవాళ పెద్ద ఎత్తున మద్యం విక్రయాలు సాగే అవకాశం ఉన్నందున మందు బాబుల సౌకర్యం కోసం అర్ధరాత్రి వరకు మద్యం దుకాణాలు తెరిచే ఉంచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.