Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ ఇంటలిజెన్స్ ఏమైంది ?

  • బతుకమ్మ కుట్ర జరిగితే సర్కారుకు నివేదించలేదా?
  • వారం రోజుల ముందే కుట్ర అయితే నిఘా ఏమైనట్లు
  • కేటిఆర్ వ్యాఖ్యలతో కొత్త అనుమానాలు
why telangana intelligence failed to alert kcr on saree burning

తెలంగాణ రాష్ట్రంలో పటిష్టమైన ఇంటలిజెన్స్ వ్యవస్థ ఉందని అందరూ భావిస్తున్నారు. చీమ చిటుక్కుమన్నా సర్కారుకు తెలిపేందుకు వేగులు మెరపు వేగంతో పనిచేస్తుంటాన్న ప్రచారం ఉంది. కానీ తాజాగా బతుకమ్మ చీరల విషయంలో తెలంగాణ ఇంటలిజెన్స్ ఘోరంగా విఫలమైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంతకూ ఇంటలిజెన్స్ నిద్ర పోతుందా? లేక నిజంగానే పనిచేస్తుందా? కేటిఆర్ వ్యాఖ్యల నేపథ్యంలో ఇంటలిజెన్స్ పనితీరు చర్చనీయాంశమవుతోంది.

తెలంగాణలో సర్కారు బతుకమ్మ చీరల పంపిణీ కోసం గత నాలుగు నెలలుగా కసరత్తు చేస్తోంది. భారీ కార్యక్రమం కావడం, లక్షల మంది లబ్ధిదారులు ఉండడం కారణంగా సుదీర్గ కసరత్తు చేసింది ప్రభుత్వం. కానీ ఈ కార్యక్రమంపై తొలిరోజే పెద్ద దుమారం రేగింది. మహిళలు రోడ్డెక్కి సర్కారుపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్నిచోట్ల ప్రతిపక్ష పార్టీలే వెనుక ఉండి మహిళల చేత ఆందోళనలు చేయించాయని టిఆర్ఎస్ ఆరోపిస్తోంది.

సోమవారం సచివాలయంలో మంత్రి కేటిఆర్ జరిపిన విలేకరుల సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. బతుకమ్మ చీరల పంపిణీ కంటే ఒక వారం రోజుల ముందు నుంచే విపక్ష కాంగ్రెస్, టిడిపి, బిజెపి పార్టీలు కుట్ర పన్నినట్లు ఆరోపించారు కేటిఆర్. అందుకే చీరల పంపిణీ ప్రారంభం కాగానే చీరల దహనాలు జరిగిపోయాయని, దీనికి వారం రోజులుగా స్కెచ్ వేసి విపక్షాలు కుట్ర చేశాయని కేటిఆర్ స్పష్టం చేశారు.

మరి నిజానికి వారం రోజుల ముందునుంచే విపక్షాలు కుట్ర చేస్తే సర్కారుకు సమాచారాన్ని చేరవేయాల్సిన నిఘా వ్యవస్థ ఎక్కడ నిద్ర పోయిందన్న ప్రశ్న ఉత్నన్నమవుతోంది. నిఘా వ్యవస్థ నిద్ర పోయిందా? లేక వాళ్లకు విపక్షాల కుట్ర సమాచారం తెలిసినా ప్రభుత్వానికి తెలియజేయలేదా? లేక తెలియజేసినా ప్రభుత్వ పెద్దలు పట్టించుకోలేదా? లేకపోతే నిఘా టీమ్ సమాచారం ఇచ్చినా ఇంత సీన్ జరగదన్న భరోసాతో సర్కారు వ్యవహరించిందా అన్న ప్రశ్నలన్నీ ఉత్పన్నమవుతున్నాయి.

ఒకవేళ కుట్ర జరగలేదనుకుంటే కేటిఆర్ విపక్షాలను కౌంటర్ చేసేందుకు ఈ మాటలను ప్రయోగించారా అన్న చర్చ కూడా ఉత్పన్నమవుతోంది. తెలంగాణలోని 31 జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల ప్రతిపక్షాలు చీరలు కాలబెట్టించొచ్చు... కానీ సర్కారు చెబుతున్నదానికంటే ఎక్కువగానే జనాలు సర్కారు ఇచ్చినవి నాసిరకం చీరలంటూ ఆగ్రహం ప్రదర్శించారు.

ఈ నేపథ్యంలో కేటిఆర్ వ్యాఖ్యలు కొత్త అనుమానాలకు తావిస్తున్నాయని చెప్పవచ్చు.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

 

Follow Us:
Download App:
  • android
  • ios