హైదరాబాద్: సమత రేప్, హత్య కేసులో దోషులకు తెలంగాణ హైకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. ఆదిలాబాద్ స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు విధించిన మరణశిక్షను ఎందుకు అమలు చేయకూడదో చెప్పుకోవాలని హైకోర్టు వారిని అడిగింది. సమత కేసులో ముగ్గురు దోషులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు విధించిన మరణశిక్షను ధ్రువీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును అడిగింది. 

ఆ తర్వాత కేసును మార్చి 24వ తేదీకి వాయిదా వేసింది. సమత రేప్, హత్య కేసులో ముగ్గురు నిందితులు షేక్ బాబు, షేక్ షాబొద్దీన్, షేక్ మఖ్దూంలకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే. దాంతో హైకోర్టు ముందు వారు తమ అభ్యంతరాలను వ్యక్తం చేయాల్సి ఉంటుంది. 

Also Read: సమత కేసులో దోషులకు ఉరి: తెలంగాణలో ఉరికంభాల్లేవు

సమత గ్యాంగ్ రేప్, హత్య కేసులో ముగ్గురికి మరణశిక్ష విధిస్తూ ఫాస్ట్ ట్రాక్ కోర్టు జనవరి 30వ తేదీన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఉరిశిక్షను అమలు చేయడానికి నిబంధనల మేరకు క్రిమినల్ ప్రొసీజర్కోడ్ 366వ సెక్షన్ ప్రకారం హైకోర్టు ధ్రువీకరణ అవసరం. హైకోర్టు ధ్రువీకరించడానకిి వారిని ఉరి తీయడానికి వీలు లేదు. 

మరణశిక్షను అమలు చేయడానికి ముందు హైకోర్టు చట్టప్రకారం, కేసు వాస్తవాలను పరిశీలించి సంతృప్తి చెందాల్సి ఉంటుంది. చెప్పాలంటే, నిందితుల విషయంలో హైకోర్టు స్వతంత్రంగా తన నిర్ణయాన్ని వెల్లడిస్తుంది. 

Also Read: సమత కేసు: నిందితులకు ఉరి శిక్ష విధింపు

చట్టప్రకారం హైకోర్టు మరణశిక్షను ధ్రువీకరించవచ్చు లేదా దానికి బదులు మరో శిక్షను విధించివచ్చు. కేసును విచారించి, నిందితులపై తగిన ఆధారాలు లేకపోతే నిర్దోషులుగా కూడా ప్రకటించే హక్కు హైకోర్టుకు ఉంటుంది.