హైదరాబాద్: సమత కేసులో  ముగ్గురు దోషులకుఉరి శిక్ష విధిస్తూ ఆదిలాబాద్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు శిక్ష విధించడంతో  ఉరి శిక్షపై తెలంగాణలో చర్చ ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జైళ్లలో ఉరి తీసేందుకు అనువైన ఉరికంబాలు లేవు. దీంతో  సమత దోషులకు ఎక్కడ  ఉరిని అమలు చేస్తారనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

Also read:ఇది ప్రజల విజయం: సమత కేసులో దోషులకు ఉరిపై పీపీ

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  1978లో చివరిసారిగా ముషీరాబాద్ సెంట్రల్ జైలులో ఉరిశిక్షను అమలు చేశారు. ఆ తర్వాత ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కాని రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడ ఉరిశిక్షను అమలు చేయలేదు.

Also read:సమత కేసులో దోషులకు ఉరి: ఎస్పీ కాళ్లు మొక్కిన భర్త గోపి

ముషీరాబాద్‌ జైలు చర్లపల్లికి తరలిపోవడం అక్కడ ఉరికంబాన్ని ఏర్పాటు చేయకపోవడంతో ఇప్పుడు తెలంగాణలోని ఏ కారాగారంలోనూ ఉరిశిక్ష అమలుకు అవకాశం లేదు.సమత కేసుతోపాటు వరంగల్‌లో 9నెలల చిన్నారి హత్యాచారం కేసులో దోషికి దిల్‌సుఖ్‌నగర్‌ జంటపేలుళ్ల కేసులో ఐదుగురు ఇండియన్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాదులకు ఉరిశిక్షలు ఖరారయ్యాయి.

తెలంగాణలోని ఒక్క జైలులో కూడ ఉరి కొయ్యలు లేవు.చంచల్‌గూడ, వరంగల్‌ కేంద్ర కారాగారాల్లో ఉరికంబాల ఏర్పాటు ఆవశ్యకతను ప్రస్తావించారు. ప్రభుత్వం నుంచి అనుమతులు రాలేదు. ప్రతి రాష్ట్రానికి ప్రత్యేకంగా జైలు మాన్యువల్స్‌ ఉంటాయి. 

దేశవ్యాప్తంగా 94 మందికి ఉరిశిక్షలు అమలు చేశారు. వాటిల్లో 42 ఉరిశిక్షలు రాజమండ్రి కేంద్ర కారాగారంలో అమలయ్యాయి. 1874 బ్రిటిష్‌ హయాంలోనే ఉరికంబం ఏర్పాటైంది. 1949 నుంచి అక్కడ ఉరిశిక్షలు అమలయ్యాయి.రాజమండ్రి కేంద్ర కారాగారంలో 1976 ఫిబ్రవరిలో చివరిసారిగా ఉరిశిక్ష అమలైంది. అనంతపురం జిల్లాకు చెందిన నంబి కిష్టప్ప అనే వ్యక్తిని ఓ హత్యకేసులో ఉరి తీశారు.

ముషీరాబాద్‌ కేంద్ర కారాగారంలో 1978లో చివరిసారి ఉరిశిక్షను అమలు చేశారు. వైమానికదళానికి చెందిన రామావతార్‌ యాదవ్‌ అనే వ్యక్తి మరో వ్యక్తిని  హత్య చేసి మృతదేహన్ని సూట్‌కేసులో తీసుకెళ్తుండగా అరెస్టు చేశారు. ఈ జైలులో రామావతార్‌ను ఉరి తీశారు. ఇదే ఉమ్మడి రాష్ట్రంలో చివరి ఉరిశిక్షగా  జైలు అధికారులు చెబుతున్నారు. 

1993 నాటి చిలకలూరిపేట బస్సు దహనం కేసులో ఇద్దరు దోషులకు ఉరిశిక్ష పడింది. 1997లో వారిని రాజమండ్రి జైలుకు తరలించారు. 1999లో డెత్‌వారెంట్‌ జారీ అయ్యింది. 

నిర్ణీత తేదీన తెల్లవారుజామున 5గంటలకు ఉరి తీయాల్సి ఉండగా సుప్రీంకోర్టు ‘యధాతథస్థితి’ కారణంగా. ఉరిశిక్షను రద్దుచేయాలంటూ తెల్లవారుజామున ఒంటిగంటకు జైలు అధికారులకు ఫోన్‌కాల్‌ వచ్చింది. తెల్లవారుజామున 3 గంటలకు వారికి అధికారిక ఉత్తర్వులు అందాయి. దీంతో ఉరి రద్దయింది.