BJP Bandi Sanjay: వేములవాడ ఎమ్మెల్యే ఏ దేశంలో ఉన్నాడో ఎవరికీ తెలియదనీ, ప్రజలకు అందుబాటులో లేని ఎమ్మెల్యే పై సీఎం కేసీఆర్ కి ఎందుకు అంత ప్రేమ..? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. నేడు బీజేపీ చేపట్టిన 'ప్రజా గోస - బీజేపీ భరోసా అనే బైక్ ర్యాలీని బండి సంజయ్ వేములవాడలో ప్రారంభించారు.
BJP Bandi Sanjay: భారత రాష్ట్ర పతిగా NDA అభ్యర్థి ద్రౌపది ముర్ము ఎన్నిక కావడం దేశ ప్రజల విజయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అభివర్ణించారు. NDA అభ్యర్థికి విపక్షాలు కూడా సపోర్టు చేశాయని తెలిపారు. కానీ, తెరాస మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సపోర్ట్ చేసిందనీ, గిరిజన మహిళ అభ్యర్థిని ఓడించడానికి అనేక విధాలుగా ప్రయత్నించారని విమర్శించారు. నేడు బీజేపీ చేపట్టిన 'ప్రజా గోస - బీజేపీ భరోసా అనే బైక్ ర్యాలీని బండి సంజయ్ వేములవాడలో ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెరాస, కాంగ్రెస్ రెండు ఒక్కటేననీ విమర్శించారు. రాష్ట్రపతిగా ద్రౌపతి ఎన్నిక కావడంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. గిరిజన బిడ్డను రాష్ట్రపతిగా నిలబెట్టిన ఘనత బీజేపీదేనని అన్నారు.
పార్లమెంట్ లో తెరాస, కాంగ్రెస్ కలిసి పోయాయని ఆరోపించారు. రాష్ట్రపతిగా గిరిజన బిడ్డ ఎన్నిక కావడం చాలా సంతోషంగా ఉందనీ, ఆ ఘనత బీజేపీతోనే సాధ్యమైందని అన్నారు. సీఎం కేసీఆర్ మాట తప్పదనీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దళిత అభ్యర్థిని చేస్తాననీ ప్రగల్భాలు పలికి .. చివరి తానే సీఎం కూర్చీలో కూర్చున్నడని విమర్శించారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలన కొనసాగుతోందనీ, వారి దోపిడికి అడ్డుఅదుపు లేకుండా పోయిందనీ, కేంద్ర ప్రభుత్వ ఇస్తున్న పథకాలను రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటుందని విమర్శించారు.
బీజేపి అధికారంలో వేస్తే.. రాష్ట్రంలో ఉచిత విద్య, వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ రెండు ఒక్కటైన బీజేపీని ఢీ కొట్టాలేరని, బీజేపీ సింహంలా.. సింగిల్ గా వస్తుందని అన్నారు. వేములవాడ ఎమ్మెల్యే ఏ దేశం లో ఉన్నాడో ఎవరికీ తెలియదనీ, ప్రజలకు అందుబాటులో లేని ఎమ్మెల్యే పై సీఎం కేసీఆర్ కి ఎందుకు అంత ప్రేమ..? అని ప్రశ్నించారు. రాజన్న గుడికి ఏటా 100 కోట్లు అంటివి...నిధులు ఎందుకు ఇవ్వడం లేదు..పేదల దేవుడు అని అభివృద్ధి చేయాలని లేదా? అన్ని ప్రశ్నించారు. ప్రసాదం స్కీమ్ కింద అప్లై చేస్తే.. కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని, దేవుడ్ని కూడ మోసం చేస్తున్న వ్యక్తి కేసీఆర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేటీ నుంచి బీజేపీ 'ప్రజా గోస - బీజేపీ భరోసా' పేరుతో బైక్ ర్యాలీని నిర్వహించనున్నది. ఈ యాత్రను బండి సంజయ్ సిద్దిపేటలోని నాంచార్‌పల్లి గ్రామంలోప్రారంభించారు. ఈ యాత్ర పది రోజులపాటు జరుగునున్నది. బైక్ లతో బీజేపీ నేతలు రాష్ట్రంలోని పలు గ్రామాల్లో పర్యటించనున్నారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ బీజేపీ ఇంచార్జి మురళీధర్ రావు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం వారు వేములవాడ వెళ్లి అక్కడ కూడా బైక్ ర్యాలీని బండి సంజయ్ ప్రారంభించారు. ఈ భరోసా యాత్రలో భాగంగా తొలుత 6 నియోజకవర్గాల్లో బీజేపీ నేతలు పర్యటిస్తున్నారు.
ఈ క్రమంలో తాండురు నియోజకవర్గంలో డీకే అరుణ, బోధన్ నియోజక వర్గంలో ఎమ్మెల్యే రాజాసింగ్, జుక్కల్ నియోజక వర్గంలో వివేక్ వెంకటస్వామి, వేములవాడ నియోజకవర్గంలో యెండల లక్ష్మీనారాయణ, సిద్దిపేట నియోజకవర్గంలో మురళీధర్ రావు, నర్సంపేటలో రఘునందన్ రావు పర్యటిస్తున్నారు. పదిరోజుల పాటు సాగే ఈ ర్యాలీలో పలు గ్రామంలో పర్యటించి.. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటారు బీజేపీ నేతలు. త్వరలోనే మిగతా ప్రాంతాల్లోనూ ఈ కార్యక్రమాలను ప్రారంభించాలని బీజేపీ అగ్ర నేతలు భావిస్తున్నారు.
