నిర్మల్:  ఎంఐఎంను ఎదుర్కొనే సత్తా కేసీఆర్ కు ఉందా అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అని కేసీఆర్ ప్రశ్నించారు. ఈ ఎన్నికలు తెలంగాణకు  ఎంతో ముఖ్యమైనవన్నారు.

నిర్మల్‌లో జరిగిన బీజేపీ ఎన్నికల సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పాల్గొన్నారు.ఇక్కడనే ఓవైసీ హిందూ దేవుళ్ల అవమానించారని  గుర్తు చేశారు.
ఒకప్పుడు నిర్మల్ పరిశ్రమలకు కేంద్రంగా ఉండేది. 

కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. 2012 నుండి తాను నిర్మల్ పేరు వింటున్నట్టు ఆయన గుర్తు చేసుకొన్నారు.ఇప్పటికీ టీడీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్‌లకు అవకాశమిచ్చారని.. ఒక్కసారీ బీజేపీకి అవకాశం ఇవ్వాలని  అమిత్ షా  కోరారు.

ఎంఐఎంను ఎదుర్కొనే సత్తా బీజేపీకే మాత్రమే సత్తా ఉందన్నారు. అయినా ఓవైసీ సోదరులను కేసీఆర్ ఏమైనా అనే ధైర్యం ఉందా అని కేసీఆర్ ను  ఆయన ప్రశ్నించారు.

కొండగట్టు బస్సు ప్రమాదంలో 65 మంది మృతి చెందితే  బాధితులను పరామర్శించే  సమయం కేసీఆర్ కు లేదన్నారు. కానీ, ఓవైసీ సోదరులతో కలిసి బిర్యానీ తినే  సమయం కేసీఆర్ ఉందని  చెప్పారు

సంబంధిత వార్తలు

చట్ట విరుద్దంగా ముస్లింలకు రిజర్వేషన్లు:కేసీఆర్‌పై అమిత్‌షా

ఐదో లిస్ట్: 19 మందితో బీజేపీ అభ్యర్థుల జాబితా ఇదే