Asianet News TeluguAsianet News Telugu

ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకా గడ్డం ఎందుకు తీయలేదు?

ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి ఆశావహుల్లో ఉన్నారు. రేవంత్ రెడ్డినే మొదటినుంచి ముఖ్యమంత్రి అనుకుంటున్నప్పటికీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తాను కూడా రేసులో ఉన్నానని చెప్పుకొచ్చారు. అధిష్టానంతో వీలైనంత వరకు చర్చలు జరిపారు. 

Why did Uttam Kumar Reddy not shave his his beard yet? - bsb
Author
First Published Dec 8, 2023, 2:17 PM IST

హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదాకా గడ్డం తీయనని  నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి శపథం చేశారు. 2016లో ఆయన చేసిన ఈ శపథం ఎనిమిదేళ్లకు నెరవేరింది. దీంతో డిసెంబర్ 2వ తేదీన మీడియాతో మాట్లాడారు. తాను ఆదివారం అంటే డిసెంబర్ మూడో తేదీన గడ్డం తీసేస్తానని తెలిపారు. ఇది సంతోషకరమైన విషయమే. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఆయన ఆశించినట్టుగానే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి హోంమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

అయితే, ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే.. ఆయన ఇంకా గడ్డం తీయలేదు. డిసెంబర్ మూడునే గడ్డం తీస్తానన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఆయన కల సాకారం అయి.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 5 రోజులు గడుస్తున్నా ఇంకా గడ్డం తీయలేదు. గడ్డంతోనే దర్శనమిస్తున్నారు.  2016లో టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందన్న ధీమాతో ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. 

మహబూబ్ నగర్ జిల్లా నుండి ఇద్దరు సీఎంలు: నాడు బూర్గుల, నేడు రేవంత్ రెడ్డి

కానీ అలా జరగలేదు. కాంగ్రెస్, తెలుగుదేశం, సీపీఐ, తెలంగాణ జనసమితిలు కలిసి మహాకూటమిగా ఏర్పడి పోటికి దిగాయి. కానీ కేసీఆర్ కు ఇది అనుకూలంగా మారింది. టీడీపీతో చేతులు కలిపారని చంద్రబాబునాయుడు వేలు పెడుతున్నాడని కేసీఆర్ ప్రచారం చేశారు. ఆంధ్రావాళ్ల పెత్తనం ఇంకా అవసరమా అనే సెంటిమెంటును రగిల్చాడు. దీంతో అంతిమంగా కాంగ్రెస్ నష్టపోయింది. కేవలం 21 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి తన మాటకు కట్టుబడి గడ్డంతోనే కంటిన్యూ అయ్యారు. 

చివరికి టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి రావడం, ఈసారి 2023 ఎన్నికల్లో ఎలాగైనా కాంగ్రెస్ ను గెలిపించుకోవాలని అధిష్టానం కూడా చాలా సీరియస్ గా తీసుకోవడం, కుమ్ములాటలు లేకుండా జాగ్రత్త పడడం.. ప్రజల్లో కేసీఆర్ పట్ల తీవ్ర వ్యతిరేకత.. ఏదైతేనేం కాంగ్రెస్ 64 స్థానాలతో అధికారంలోకి వచ్చింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి కల నెరవేరింది. 

కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి ఆశావహుల్లో ఉన్నారు. రేవంత్ రెడ్డినే మొదటినుంచి ముఖ్యమంత్రి అనుకుంటున్నప్పటికీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తాను కూడా రేసులో ఉన్నానని చెప్పుకొచ్చారు. అధిష్టానంతో వీలైనంత వరకు చర్చలు జరిపారు. కానీ అవి ఫలించలేదు. హోం మంత్రి పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ కారణాలతోనే ఇంకా గడ్డం తీయలేదా? లేక ఫలితాల తరువాతి బిజీతో గడ్డం తీయలేదా?.. తెలియాలంటే.. ఇంకొద్ది రోజులు వేచి చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios