హైదరాబాద్: కరోనా పరీక్షలను  ఎందుకు తగ్గించారని  తెలంగాణ హైకోర్టు  ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.కరోనా కేసులపై తెలంగాణ హైకోర్టు గురువారం నాడు విచారించింది. 

మహారాష్ట్రలో రోజుకు లక్షన్నర కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారని హైకోర్టు తెలిపింది. తెలంగాణలో రోజుకు 4 వేల పరీక్షలు చేస్తామన్న హమీ ఎందుకు అమలు కావడం లేదని హైకోర్టు గుర్తు చేసింది. కరోనా పరీక్షలు ఎందుకు తగ్గించారని ప్రశ్నించింది.

మిగతా రాష్ట్రా కంటే  కరోనా పరీక్షల్లో వెనుకబడి ఉన్నారని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి గుర్తు చేసింది.  వెయ్యి మందికి కనీసం 3 బెడ్లు లేకపోవడం కారణాలేమిటో చెప్పాల్సిందిగా కోరింది.  

ఆసుపత్రిలో పడకలు పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకొంటున్నారని ప్రభుత్వాన్ని కోరింది. డబ్ల్యుహెచ్ఓ ప్రమాణాలకు అనుగుణంగా ఆసుపత్రుల్లో బెడ్లు ఎందుకు లేవని హైకోర్టు ప్రశ్నించింది. నివేదిక సమర్పించేందుకు గడువు ఇవ్వాలని కోరిన అడ్వకేట్ జనరల్ హైకోర్టును కోరారు. ఈ కేసు విచారణను అక్టోబర్ 8వ  తేదీకి వాయిదా వేసింది.