Asianet News TeluguAsianet News Telugu

కొంగునాడు పై మాట్లాడరేమీ..?

ఈ పంచెకట్టు పెద్దాయన తెలుగు ప్రజలకు రెండు రాష్ట్రాలు ఎందుకు ఉండకూడదని ప్రశ్నించడం బాగానే ఉంది. మరి, తమిళ ప్రజలకు కూడా రెండు రాష్ట్రాలు ఎందుకు ఉండకూడదు. ‘కొంగునాడు’ ఉద్యమాన్ని ఎందుకు తొక్కేస్తున్నారు అనేది చెప్పాల్సిన అవసరం ఉంది.

why chidambaram is not supported kongunadu

 

తెలంగాణ ఏర్పాటు క్రెడిట్ కాంగ్రెస్ కు దక్కకుండా పోయిందన్నది ఎంత నిజమో... నవ తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా కూడా కాంగ్రెస్ రాణించడం లేదన్నది అంతే నిజం. రాష్ట్ర ఏర్పాటుపై సాగదీత ధోరిణి, ద్వంద్వ వైఖరి వల్లే ఆ పార్టీని తెలంగాణ ప్రజలు  తిరస్కరించేలా చేసింది.

 

మరీ ముఖ్యంగా డిసెంబర్ 9, 24 తేదీలను తెలంగాణ ప్రజలు ఎప్పుడూ మరిచిపోరు. ఆ రెండు తేదీలలలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి తేలతెల్లమైంది. ముఖ్యంగా ఆ రెండు తేదీలను ఎప్పుడు గుర్తు చేసుకున్న ఓ పంచెకట్టు పెద్దాయనే గుర్తొస్తారు. ఆయనే మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం.

 

ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ పీసీసీ విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...  తెలంగాణ సెంటిమెంట్ ను గౌరవించి తమ పార్టీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిందని గుర్తు చేశారు. తెలుగు ప్రజలకు రెండు రాష్ట్రాలు ఎందుకు ఉండకూడదని ఆయన ప్రశ్నించారు. చిన్నరాష్ట్రాలు వేగంగా అభివృద్ధి చెందుతాయన్నారు.

 

గుజరాత్,  పంజాబ్, హర్యానా ఇందుకు నిదర్శనమని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల హామీలను ఎందుకు నెరవేర్చడం లేదని ఆయన ప్రశ్నించారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్న హామీ ఏమైందని నిలదీశారు.

 

ఆ తర్వాత కేంద్రాన్ని కూడా ఏకిపడేశారు... పాత పెద్ద నోట్ల రద్దు అతి పెద్ద కుంభకోణం ఆరోపించారు. నోట్ల రద్దు తర్వాత ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని తెలిపారు. ఇలా తన ప్రసంగంలో అంతా పాతపాటే పాడారు తప్పితే పార్టీ పటిష్టతకు పనికొచ్చే ఒక్క విషయాన్ని కూడా చర్చించలేదు.

 

అంతెందుకు ఏపీ ప్రత్యేకహోదాకు టీఆర్ఎస్ నేతలు కూడా మద్దతు తెలుపుతుంటే కాంగ్రెస్ లో కీలక నేతగా ఉన్న చిదంబరం దానిపై మాటకూడా మాట్లాడకపోవడం విచిత్రం.

 

ఈ పంచెకట్టు పెద్దాయన తెలుగు ప్రజలకు రెండు రాష్ట్రాలు ఎందుకు ఉండకూడదని ప్రశ్నించడం బాగానే ఉంది. మరి, తమిళ ప్రజలకు కూడా రెండు రాష్ట్రాలు ఎందుకు ఉండకూడదు. ‘కొంగునాడు’ నినాదాన్ని ఎందుకు తొక్కేస్తున్నారు అనేది చెప్పాల్సిన అవసరం ఉంది.

 

చిన్నరాష్ట్రాలు బాగా అభివృద్ది చెందుతాయని తెలిసినప్పుడు తెలంగాణ ఏర్పాటును ఇంత ఆలస్యంగా ఎందుకు ఏర్పాటు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios