Chicken: 20 రోజుల్లో భారీగా పడిపోయిన చికెన్ ధరలు.. ఎందుకో తెలుసా?

చికెన్ ధరలు భారీగా పతనం అవుతున్నాయి. హైదరాబాద్‌లో కేవలం 20 రోజుల్లోనే సుమారు 22 శాతం తగ్గుదల కనిపించింది. కార్తీక మాసం కారణంగా ఈ మార్పు ఉన్నట్టు చెబుతున్నారు.
 

why chicken rates fallen around 20 percent in over 20 days, karhika masam impact on chicken kms

హైదరాబాద్: గత 20 రోజులుగా చికెన్ ధరలు భారీగా పతనం అవుతున్నాయి. హైదరాబాద్‌లో సుమారు 20 రోజుల్లో చికెన్ ధరలు 22 శాతం పడిపోయాయి. చికెన్ ధరలు తగ్గడంపై కొందరిలో అనుమానాలూ ఉన్నాయి. ఈ ధరలు ఎందుకు తగ్గుతున్నాయనే ఆసక్తి పెరుగుతున్నది. అసలు చికెన్ ధరలు ఎందుకు తగ్గుతున్నాయనే దానిపై ఈగల్ ఫిషరీస్ ప్రొప్రైటర్ సయ్యద్ ఫయజుద్దీన్ స్పందించారు. సప్లై, డిమాండ్‌లో అంతరం పెరగడం మూలంగానే ధరలు తగ్గుతున్నాయని చెప్పారు.

అక్టోబర్ 29వ తేదీ నుంచి కార్తీక మాసం ప్రారంభమైంది. ఈ నెల 27వ తేదీ వరకు ఇది కొనసాగుతుంది. కార్తీక మాసంలో సాధారణంగా హిందువులు, ముఖ్యంగా ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉండే కుటుంబాలు మాంసం తినరు. కార్తీక మాసంలో చికెన్‌తోపాటు మరే ఇతర మాంసాన్ని కూడా భుజించరు. ఇది మాంసం ధరలను ప్రభావితం చేస్తున్నది. అందుకే ధరలు తగ్గుతూ పోతున్నాయి. 

Also Read : 55 సార్లు కత్తితో పొడిచి, గొంతు కోసి, గంతులేస్తూ.. బిర్యానీ కొనివ్వలేదని 16 ఏళ్ల బాలుడి దారుణం

హైదరాబాద్‌లో నవంబర్ 3వ తేదీన లైవ్ చికెన్ కిలో రూ. 140 ఉండగా, ఇప్పుడు 126కు పడిపోయింది. స్కిన్, వితౌట్ స్కిన్, బోన్‌లెస్ చికెన్ టైప్‌లలోనూ ఈ తేడా ఉన్నది.

అయితే, కార్తీక మాసం ఈ నెల 27వ తేదీతో ముగియనుంది. కాబట్టి, కార్తీక మాసం ముగిసిన తర్వాత మళ్లీ ధలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. చికెన్ ధరల్లో సుస్థిరత నెలకొనే అవకాశం ఉన్నదని తెలిసింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios