బిత్తిరి సత్తిపై అందుకే దాడి చేసిన

బిత్తిరి సత్తిపై అందుకే దాడి చేసిన

టివి తెర మీద తన యాస, భాష, నడక తీరుతో తెలంగాణ ప్రజలనే కాక సీమాంధ్ర తెలుగు ప్రజల మనసులో కూడా బిత్తిరి సత్తి అలియాస్ రవి స్థానం సంపాదించుకున్నాడు. సాయంత్రం అయిందంటే చాలు తెలుగు ప్రజల కండ్లన్నీ సత్తి ప్రోగ్రాం కోసం ఎదురుచూసేవి. మరి అలాంటి సత్తి మీద ఎందుకు దాడి చేయాలనుకున్నారు? నిందితుడు మణికంఠ ఏమంటున్నాడు ఈ విషయాలను కింద చదవండి.

బిత్తిరి సత్తి గతంలో బాగానే కార్యక్రమాలు చేసిండు. కానీ తెలంగాణ ఏర్పాటైన తరువాత రానురాను సత్తి భాష తెలంగాణ యాసను వెక్కిరించేలా ఉంది. అందుకే దాడి చేశాను. ఎన్నో రోజుల నుంచి దాడి చేయాలనుకున్న....కానీ వీలు కాలేదు..ఈ రోజు దొరికిండు.. అందుకే వచ్చి దాడి చేసిన. అని నిందితుడు మణికంఠ పోలీసులకు చెప్పినట్లు సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నయి. 

తెలంగాణ భాషను, యాసను కించపరిచేలా బిత్తిరి సత్తి ఇటీవల కాలంలో మాట్లాడుతున్నాడని, తాను తట్టుకోలేకపోతున్నట్లు మణికంఠ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ యాస గురించి ఎట్లాబడితే అట్లా మాట్లాడితే తానేమీ గాంధీని కాదని, అందుకే దాడి చేసినట్లు చెప్పుకొచ్చారట. దాడి చేసింది తాను ఒక్కడినే తప్ప ఎలాంటి గ్యాంగ్ ను తీసుకురాలేదన్నారు. 

తనకు డైరెక్టర్ కావాలన్న ఆలోచన ఉన్నట్లు కూడా మణికంఠ పోలీసులకు తెలిపినట్లు వివరాలు బయటకొస్తున్నాయి. తాను కాబోయే దర్శకుడిని, తనకు సినిమాల మీద ఆసక్తి ఉంది అంటూ ఆయన పోలీసులకు చెప్పిండట. అయితే నిందితుడు తాగి ఉన్నట్లు ఆరోపణలు కూడా వస్తున్నాయి.

మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Telangana

Next page