తెలంగాణలో ఆటోలో తిరిగే ఎమ్మెల్యేలు బాగానే ఉన్నారు. సిపిఎం పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఎప్పుడు చూసినా ఆటోల్లో, బస్సుల్లో, టూవీలర్ల మీద తిరుగుతుంటారు. ఆయన కారు వాడరు. సచావాలయానికి కూడా ఆటోలోనే వస్తారు.

తాజాగా మరో తెలంగాణ ఎమ్మెల్యే ఆటోలో ప్రయాణించారు. ఆయనెవరంటే..? బిజెపి పార్టీకి చెందిన ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్. ఆయన ఒకరోజు రాత్రిపూట షేరింగ్ ఆటోలో దిగారు. దిగగానే ఆయన వెంట ఉన్న గన్ మెన్ ఆటో డ్రైవర్ కు ఛార్జీలు ఇచ్చారు. తర్వా ఇద్దరూ కలిసి వెళ్లిపోయారు.

ఉప్పల్ ఎమ్మెల్యే షేరింగ్ ఆటోలో దిగడాన్ని చూసిన స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. పైన వీడియో ఉంది మీరూ చూడండి.