భక్తులు పాము కనపడటమే కాకుండా.. ఆ పాము శ్వేత నాగు కావడంతో మరింత భక్తితో పరవశించి పోతున్నారు

నేడు మహాశివరాత్రి అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ రోజు ప్రతి ఒక్కరూ గుడికి వెళ్లి ఆ పరమ శివుడిని దర్శించుకుంటారు. కాగా.. ఈ రోజు కనుక పాము కనపడితే.. మరింత మంచిదిగా భావిస్తారు. ఆ పరమ శివుని ప్రతిరూపంగా భావిస్తారు. కాగా.. కొందరు భక్తులు పాము కనపడటమే కాకుండా.. ఆ పాము శ్వేత నాగు కావడంతో మరింత భక్తితో పరవశించి పోతున్నారు. ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాలలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మంచిర్యాల జిల్లాలోని లక్సీట్టిపెట్ మునిసిపాలిటీ పరిధిలోని కోర్టు ఆవరణలో మహా శివరాత్రి పర్వదినాన పసుపునుటి సంతోష్ ఇనే వ్యక్తి ఇంటి పరిధిలో అరుదైన పెద్ద శ్వేతనాగు దర్శనం ఇచ్చింది. కాలనీ వాసులు పెద్దఎత్తున శ్వేత నాగు పాముకు పూజలు చేసి పాలు పోశారు. 

మహాశివరాత్రి రోజు ఈ శ్వేత దర్శనం ఇవ్వడంతో జన్మ ధన్యమైందని భక్తులు అన్నారు. ఈ శ్వేత నాగును దర్శించుకునేందుకు కాలనీ వాసులు తరలివచ్చారు. స్థానికులు స్నేక్ ‌క్యాచర్‌కు సమాచారం ఇవ్వడంతో.. ‌శ్వేతనాగును పట్టుకుని అడవిలో వదిలేశారు.